Home
News

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

అమెజాన్ ఇండియా 2020 సంవత్సరంలో తన మొదటి గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రకటించింది. అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ సేల్ జనవరి 19 న ప్రారంభమై జనవరి 22 వరకు కొనసాగుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సేల్స్ లో ఈ-కామర్స్ దిగ్గజం గొప్ప ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఒక రోజు ముందుగా అంటే జనవరి 18 నుండే కొనుగోలు చేయడానికి యాక్సిస్ లభిస్తుంది.

డిస్కౌంట్స్

డిస్కౌంట్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో కొత్తగా విడుదలైన అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ జాబితాలో ఒప్పో, శామ్‌సంగ్, షియోమి, రియల్‌మి, LG మరియు వివో వంటి బ్రాండ్ల ఫోన్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను నెలకు రూ. 833 ల చొప్పున EMI ఎంపికలలో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు మీద 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి అమెజాన్ ఇండియా SBI బ్యాంక్ తో భాగస్వామ్యం కలిగి ఉంది.

 

 

స్మార్ట్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌లు

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌లో రెడ్‌మి నోట్ 8 ప్రో వంటి కొత్త ఫోన్‌లను తగ్గింపు ధరలతో అందివ్వనున్నాయి. అలాగే వన్‌ప్లస్ 7T స్మార్ట్‌ఫోన్‌ను 12 నెలల వరకు ఎటువంటి ఖర్చులేకుండా EMIలతో పాటు ఎక్స్ఛేంజ్‌లో అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ M30 మరియు వివో U20 ఫోన్లు కూడా ఈ సేల్స్ సమయంలో తగ్గింపు ధరల వద్ద జాబితా చేయబడ్డాయి. అలాగే ఆపిల్ యొక్క ఐఫోన్ XR కూడా ‘గొప్ప ఆఫర్‌ల' వివరాలతో జాబితా చేయబడింది. వీటి యొక్క మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అమెజాన్ యొక్క వెబ్ సైట్ ను ఓపెన్ చేసి చూడవచ్చు.

 

 

ఎలక్ట్రానిక్స్ డివైస్

ఎలక్ట్రానిక్స్ డివైస్

ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియా సేల్‌లో హెచ్‌ఎండి గ్లోబల్, రియల్‌మి, హువాయి, హానర్, ఒప్పో, ఎల్‌జి స్మార్ట్‌ఫోన్ ఒప్పందాలను త్వరలో విడుదల చేయనుంది. అలాగే ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లైన హెచ్‌పి, జెబిఎల్, బోస్, సోనీ వంటి ఇతర మొబైల్ ఉపకరణాలను రూ.69లకే అందివ్వనున్నది.

 

 

అమెజాన్ ఎకో రేంజ్

అమెజాన్ డివైస్లైన ఎకో రేంజ్, ఫైర్‌టివి స్టిక్, కిండ్లి ఇ-రీడర్‌ల పరికరాలను 45 శాతం తగ్గింపు ధరతో పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. ఎకో ఇన్ పుట్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్లు మరియు ఒనిడా ఫైర్ టివి ఎడిషన్ స్మార్ట్ టివిలు కూడా తక్కువ ఆఫర్లతో జాబితాలో ఉన్నాయి. ఇ-టైలర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ యొక్క వెబ్ పేజీకి వెళ్ళి ఇక్కడ మీరు అన్ని ఒప్పందాలను చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Sales Announced: Check Discounts, Offers and More Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X