Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం డిస్కౌంట్..!
అమెజాన్ వినియోగదారులకు సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 (Amazon Great Republic day sale 2024) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ప్లాట్‌ఫాంలో షేర్ చేసింది. ఈ అమెజాన్ సేల్ 2024కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కథనం మీకోసం.
బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు : ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకు కొన్ని రోజుల ముందు అమెజాన్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్, హెడ్‌సెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సహా గృహోపకరణాలతోపాటు అనేక ఉత్పత్తులపై బెస్ట్ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. దీంతోపాటు ఎంపికచేసిన బ్యాంకు కార్డులపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందించనుంది.

అమెజాన్ హోం పేజీలో సేల్ వివరాలు : అమెజాన్ తన ప్లాట్‌ఫాంలో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌కు సంబంధించిన ఫోటోను హోం పేజీలోకి తీసుకొచ్చింది. అయితే ఎప్పటి నుంచి, ఎన్నిరోజుల పాటు ఈ సేల్ జరుగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే గత సంవత్సరం ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా అదే తేదీల్లో సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ : అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగిన వినియోగదారులు సేల్‌ను ముందే యాక్సెస్ చేయవచ్చు. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు మరియు సంబంధిత ఉపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. 5G స్మార్ట్‌ఫోన్లు ధరలు రూ.9,999 నుంచి రూ.50,000 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌తో లభిస్తాయని అమెజాన్ తెలిపింది. దాంతోపాటు గ్రేట్ రిపబ్లిక్‌డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం మరియు EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఎక్చ్సేంజీ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చని తెలిపింది.
త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. మరియు సేల్ ప్రారంభం సహా ముగింపు తేదీలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఏయే ఉత్పత్తులపై ఎంత శాతం ఆఫర్, డిస్కౌంట్ వంటి వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








