అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ ట్యాబ్‌లపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే..!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. ఈ నెల 18వ తేదీ 12PM వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో (Amazon great republic day sale 2024) భాగంగా అనేక బ్రాండ్ల ట్యాబ్లెట్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్, ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు, EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.
ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024లో భాగంగా ప్రముఖ బ్రాండ్లు శాంసంగ్, షియోమీ, రెడ్‌మీ, వన్‌ప్లస్ సహా ఇతర బ్రాండ్ల ట్యాబ్‌లపై భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా గరిష్ఠంగా 60 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు SBI క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్రీ డెలివరీ, ఒక్కరోజు డెలివరీ వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ Tab S6 లైట్ : అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్‌పై 29 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్ రూ.21000కు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ 10.4 అంగుళాల TFT డిస్‌ప్లేతో వస్తుంది. మరియు 60Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8MP కెమెరా, ముందువైపు 5MP కెమెరాతో వస్తుంది.
షియోమీ ప్యాడ్ 6 : ఈ షియోమీ ప్యాడ్ 6 స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 11 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 13MP, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్లెట్‌పై 36 శాతం డిస్కాంట్ లభించింది. ఫలితంగా రూ.26,999కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ ప్యాడ్ : ఈ ప్యాడ్ 11.61 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ 4nm చిప్‌తో వస్తుంది. వెనుకవైపు 13MP కెమెరా, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా రూ.36999కు కొనుగోలు చేయవచ్చు.
హానర్ ప్యాడ్ 8 : ఈ ప్యాడ్ 12 అంగుళాల IPS 2k డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో వస్తుంది. మరియు 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7,250mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ అమెజాన్ సేల్‌లో ఈ ప్యాడ్ పై 47 శాతం డిస్కౌంట్ పొందింది. ప్రస్తుతం ఈ ప్యాడ్ ధర రూ.16,999గా ఉంది.

రెడ్‌మీ ప్యాడ్ : రెడ్‌మీ ప్యాడ్ 10.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుకవైపు 8MP, ముందువైపు 8MP కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్ హీలియో G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు ఆండ్రాయిడ్ 12 OSతో వస్తుంది. ఈ ట్యాబ్లెట్‌పైన గరిష్ఠంగా 52 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.13999కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








