Home
News

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025 తేదీలు వచ్చేశాయ్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు.. లిస్ట్..!

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ప్రతి సంవత్సరం నిర్వహించే గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ ను (Amazon Great Republic Day Sale 2025) ప్రకటన చేసింది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్‌ల ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌లకు అమెజాన్ అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు కొన్ని అదనపు ప్రయోజనాలను పొందనున్నారు.

సేల్‌ ఎప్పుడు ప్రారంభం కానుంది :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్‌ డే సేల్ 2025 జనవరి 13 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం (Amazon sale 2025) కానుంది. అయితే ప్రైమ్‌ మెంబర్లు 12 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. SBI క్రెడిట్‌ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసిన కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

amazon great republic day sale 2025

అయితే అమెజాన్‌ మైక్రోసైట్‌ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఎంట్రీ లెవల్‌ నుంచి ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్‌, ఐకూ, మోటోరోలా, శాంసంగ్‌, వివో, హానర్‌, పోకో, రెడ్‌మి, రియల్‌మి. టెక్నో వంటి స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. అయితే ధరలను వెల్లడించలేదు.

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 4, నార్డ్‌ CE 4, నార్డ్‌ CE 4 లైట్‌ సహా ఇవాళ విడుదల కానున్న వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్‌ 13R ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. మరియు ఐకూ 13, ఐకూ నియో 9, ఐకూ నియో 12, ఐకూ Z9 సిరీస్‌లను తగ్గింపు ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

amazon great republic day sale 2025

శాంసంగ్‌ గెలాక్సీ S23 అల్ట్రా, గెలాక్సీ M15 5G, గెలాక్సీ M35, గెలాక్సీ M05, మోటోరోలా రేజర్ 50 అల్ట్రా, హానర్‌ 200 5G, ఒప్పో F27 ప్రో ప్లస్, వివో X200 ప్రో 5G, షియోమీ 14, రియల్‌మి నార్జో N61, నార్జో 70X, నార్జో N65, రియల్‌మి GT 6T, రియల్‌మి Gt 7 ప్రో, రియల్‌మి నార్జో 70 టర్బో వంటి స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

వీటితోపాటు రెడ్‌మి నోట్‌ 14, రెడ్‌మి A4 5G, రెడ్‌మి 13 5G, రెడ్‌మి 13C, రెడ్‌మి నోట్‌ 13 ప్రో, టెక్నో పోవా 6 నియో, టెక్నో పాప్‌ 9 5G, టెక్నో ఫాంటమ్‌ V ఫోల్డ్, టెక్నో పాప్‌ 9 4G, పోకో M6 5G, HMD ఫ్యూజన్‌ 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లపై అమెజాన్ రిపబ్లిక్‌ డే సేల్‌లో డిస్కౌంట్‌లు పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌బడ్స్‌, పవర్‌ బ్యాంక్‌లు సహా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీ, ట్యాబ్లెట్‌లు, హెడ్‌ఫోన్స్‌, సౌండ్‌బార్‌, కెమెరాలను డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ సేల్‌లో భాగంగా డెల్‌, లెనోవో, HP సహా మరిన్ని బ్రాండ్‌లపై తగ్గింపును పొందే అవకాశం ఉంది.

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025 జనవరి 13 న ప్రారంభం కానుంది. జనవరి 19 వరకు సేల్‌ అందుబాటులోకి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అమెజాన్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే సుమారు వారం రోజులపాటు ఈ సేల్‌ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సేల్‌ ఆఫర్లు, డిస్కౌంట్‌ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon great republic day sale 2025 announced in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X