Home
News

Amazon Summer Sale అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2024 (Amazon Great Summer Sale 2024) త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు సంస్థ ప్రకటన చేసింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు 12 గంటల ముందే సేల్‌ ప్రారంభం అవుతుంది.

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్‌ లపై భారీ తగ్గింపును పొందవచ్చు. అయితే తాజాగా అమెజాన్‌ ఈ జాబితాను వెల్లడించింది. శాంసంగ్‌, వన్‌ ప్లస్‌, రెడ్‌మి, షియోమీ, ఐకూ, టెక్నో వంటి అనేక స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చు. వీటి వివరాలను కూడా అమెజాన్‌ వెల్లడించింది.

Amazon Great Summer Sale 2024

ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై డిస్కౌంట్లు :
ఈ జాబితాలో వన్‌ ప్లస్‌ 12, వన్‌ ప్లస్‌ 12R, వన్‌ప్లస్ నార్డ్‌ CE, వన్‌ప్లస్ నార్డ్‌ 3 సహా శాంసంగ్ గెలాక్సీ M34, శాంసంగ్‌ గెలాక్సీ S23, గెలాక్సీ S24, రెడ్‌మి నోట్‌ 13 ప్రో, రెడ్‌మి 13C, షియోమీ 14, ఐకూ Z9, టెక్నో పోవా 6 ప్రో హ్యాండ్‌ సెట్‌లు డిస్కౌంట్‌ ధరను కలిగి ఉండనున్నాయి.

అయితే ఈ స్మార్ట్‌ ఫోన్ల ఎంత డిస్కౌంట్‌ను పొందనున్నాయి. ఆఫర్‌ సేల్‌ ఎన్ని రోజులపాటు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ ఫోన్‌ పైనా డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఏయే హ్యాండ్‌ సెట్‌ లపై ఈ ఆఫర్లు ఉన్నాయో త్వరలో వెల్లడి కానుంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఐఫోన్ 15 సిరీస్‌ సహా ఇతర హ్యాండ్‌ సెట్‌లు ఈ జాబితాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్‌ కార్ట్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు EMI లావాదేవీలు కూడా నిర్వహించుకొనే వీలుంది.

దీంతోపాటు అమెజాన్‌ సేల్‌లో ICICI బ్యాంక్‌ మరియు బ్యాంక్‌ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కూడా డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ మే 2 నుంచి ప్రారంభం కానుండగా.. ఎప్పటి వరకు సేల్‌ కొనసాగనుందనే వివరాలు వెల్లడి కాలేదు. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ కలిగిన యూజర్లు ఒకరోజు ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు.

ఫ్లిప్‌ కార్ట్‌ కూడా..
మరో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్‌ కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ పేరుతో మే 3 నుంచి 9 వరకు సేల్‌ నిర్వహించనుంది. ఇందులో SBI కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారు. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు సహా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లను పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవాలని, దీని ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. పే లేటర్‌ ఆప్షన్‌ ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉందని తెలిపింది. యూపీఐ లావాదేవీలపై గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని పేర్కొంది.

Best Mobiles in India

English summary
Amazon Great Summer Sale 2024 here is the discounted smartphone list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X