Home
News

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్ 2024 ప్రారంభం.. స్మార్ట్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లు..!

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్ 2024 (Amazon Great Summer Sale 2024) ప్రారంభం అయింది. అయితే ఇప్పటికే ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, టీవీ, ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపును ప్రకటన చేసింది.

ఈ అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా ICICI బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మరియు వన్‌కార్డ్‌లతో కొనుగోలు చేస్తే తక్షణం 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ప్రస్తుతం ప్రైమ్‌ మెంబర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 12 PM నుంచి అందరూ డిస్కౌంట్‌ ధరలను పొందవచ్చు.

amazon great summer sale 2024 is live for prime members

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE4..
ఈ హ్యాండ్‌సెట్‌ ఇటీవలే లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌ సాధారణ ధర రూ.24,998 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.1000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.23,998 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్ 7 జెన్‌ 3 SoC పైన పనిచేస్తుంది. మరియు 100W Supervooc ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ సపోర్టును కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ 12: అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 12 హ్యాండ్‌సెట్ ధర రూ.64,999 గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3249 డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా ధర రూ.61,750 కి తగ్గుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.82 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో + : ఈ హ్యాండ్‌సెట్‌ ఈ సాధారణ ధర రూ.33,999గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.30,999 కి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనపు రూ.2,946 తగ్గింపు ధరను పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్‌ 13 : ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13.. 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.48999 కి కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ఆఫర్ల ద్వారా రూ.44,250 కే తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. దీంతోపాటు ఇతర ఐఫోన్‌ మోడళ్లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

పోకో M6 ప్రో 5G : అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 50MP డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్ సేల్‌ 2024 లో భాగంగా స్మార్ట్‌ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌వాచ్‌, ఏసీ, రిఫ్రిజిరేటర్‌ సహా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలపై గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్లను పొందవచ్చు. ఏసీలపై గరిష్ఠంగా 55 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon great summer sale 2024 is live for prime members here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X