Home
News

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 తేదీలు వచ్చేశాయ్‌.. బ్యాంకు డిస్కౌంట్‌ల వివరాలు..!

Amazon Sale May 2025 : ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ నుంచి గుడ్‌న్యూస్‌ వచ్చింది. ఈ వేసవిలో గ్రేట్ సమ్మర్‌ సేల్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెజాన్ వెల్లడించింది. దీంతోపాటు అమెజాన్‌ మైక్రోసైట్‌ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు సాధారణ యూజర్ల కంటే ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తోపాటు అనేక గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 లో (Amazon Great Summer Sale 2025) భాగంగా డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్మా‌ర్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లు, ఇయర్‌బడ్స్‌, మొబైల్‌ యాక్సెసరీస్‌ పైనా డిస్కౌంట్లను పొందవచ్చు. దీంతోపాటు స్మార్ట్‌టీవీలు, ఇతర ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Amazon great summer sale 2025 dates

సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? :
అమెజాన్ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 మే 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల (12PM) నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లు 12 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. అంటే మే 1 తేదీ 12AM నుంచే అమెజాన్‌ నుంచి షాపింగ్‌ చేయవచ్చు.

అమెజాన్ సేల్‌ బ్యాంకు ఆఫర్లు :
అమెజాన్ సమ్మర్‌ సేల్‌ 2025 లో భాగంగా HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు, EMI ట్రాన్సాక్షన్‌లపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ పే ICICI క్రెడిట్‌ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ గిఫ్ట్‌ కార్డుల ద్వారా డిస్కౌంట్‌లను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్లు :
అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 లో భాగంగా ఐఫోన్ 15, శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా 5G, వన్‌ప్లస్‌ 13R, ఏసర్‌ ఏస్పైర్‌ లైట్ రైజన్‌ 3 ల్యాప్‌టాప్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు శాంసంగ్‌ 396 లీటర్‌ సామర్థ్యం కలిగిన 3 స్టార్‌ రిఫ్రిజిరేటర్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు అనేక ఫ్యాషన్‌ ఉత్పత్తులపైనా భారీ తగ్గింపును పొందవచ్చని అమెజాన్‌ చెబుతోంది.

గరిష్టంగా 65 శాతం :
దీంతోపాటు అమెజాన్‌ సేల్‌లో భాగంగా మొబైల్స్‌ మరియు విడిభాగాలపై గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే విధంగా గృహోపకరణాలపై గరిష్ఠంగా 65 శాతం వరకు తగ్గింపు ను పొందవచ్చని అమెజాన్‌ చెబుతోంది. ట్రావెల్‌ బుకింగ్స్‌ పైనా గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అలెక్సా, ఫైర్ టీవీ వంటి ఉత్పత్తులను రూ.2599 నుంచే అందుబాటులో ఉంటాయని అమెజాన్‌ మైక్రోసైట్‌ ద్వారా తెలుస్తోంది. కేవలం రూ.99 నుంచే అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేల్‌ మే 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి వరకు సేల్‌ ఆఫర్లు అందుబాటులో ఉంటాయో వెల్లడి కాలేదు.

అమెజాన్ గ్రేట్ సమ్మర్‌ సేల్‌ తేదీ దగ్గర పడే కొద్దీ మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్‌ల, ఉత్పత్తుల వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శాంసంగ్‌, షియోమీ, వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లతోపాటు స్మార్ట్‌టీవీలు, ఎయిర్‌ కండిషనర్‌లను కూడా డిస్కౌంట్‌ ధరలకు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Amazon great summer sale 2025 dates revealed in india here are the deals and offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X