Home
News

43 అంగుళాల ఈ 4K Redmi టీవీ పై 44 శాతం భారీ డిస్కౌంట్ ఆఫర్! సేల్ వివరాలు

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 మొదలైంది. ఈ సేల్ మే 2 అర్ధరాత్రి 12 గంటల నుండి మొదలై మే 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్‌తో పరికరాలను కొనుగోలు చేయగలుగుతారు. ఈ ప్రత్యేక సేల్‌లో, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ACలు, ఇయర్‌ఫోన్‌లు, వంటి వివిధ పరికరాలపై తగ్గింపులు ఇవ్వబడ్డాయి.

సరే ఇప్పుడు విషయానికి వద్దాం అంటే ఈ సేల్ లో Redmi యొక్క 4K స్మార్ట్ టీవీ పై అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే 43 అంగుళాల Redmi Smart Fire TV 4K మోడల్‌పై 44 శాతం తగ్గింపు ఇవ్వబడింది. కాబట్టి ఈ టీవీ ఇప్పుడు ధర రూ.23,999 కే కొనుగోలు చేయవచ్చు.

Amazon Great Summer Sale Live Now

దీనికి అదనంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీకు ఈ టీవీ రూ.21,999 కే అందుబాటులో ఉంటుంది . అంటే,ఈ 4K టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ సైట్ లో పేర్కొన్నారు. మరి ఇప్పుడు ఈ టీవీ ఫీచర్లను పరిశీలిద్దాం.

43-అంగుళాల Redmi Smart Fire TV 4K స్పెసిఫికేషన్ల వివరాలు: ఈ టీవీ 4K డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ డిస్‌ప్లే 3840 x 2160 పిక్సెల్‌లు, ఆటో తక్కువ లేటెన్సీ మోడ్, 6.5ms రెస్పాన్స్ టైమ్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ రెడ్‌మీ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ఉండటం కూడా గమనించదగ్గ విషయం.

43-అంగుళాల ఈ Redmi Smart Fire TV 4K మోడల్ మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ టీవీలో అద్భుతమైన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన Fire OS 7 ద్వారా ఈ 43-అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ పనిచేస్తుంది. ఈ టీవీలో చాలా అధునాతన కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ 43-అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ శక్తివంతమైన క్వాడ్-కోర్ కార్టెక్స్ A55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Mali-G52 MC1 GPU గ్రాఫిక్స్ కార్డ్‌ని కూడా కలిగి ఉంది. కాబట్టి గేమింగ్ యూజర్లు ఈ టీవీని నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.

43 అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 4K మోడల్ 2GB RAM మరియు 8GB స్టోరేజీ ని కలిగి ఉంది. కాబట్టి మీరు ఈ టీవీలో అన్ని యాప్‌లను సజావుగా ఉపయోగించవచ్చు. అలాగే Netflix Disney+ Hotstar, Zee5, Sonylive, YouTube మొదలైన వాటిని ఈ స్మార్ట్ టీవీలో ఉపయోగించవచ్చు.

ముఖ్యంగా, 43-అంగుళాల రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ అలెక్సా వాయిస్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ రిమోట్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ స్మార్ట్ టీవీ రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కోసం షార్ట్‌కట్ బటన్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ టీవీ డిజైన్ కూడా చాలా బాగుంది.

ఈ టీవీలో డాల్బీ ఆడియో, DTS-HD మరియు DTS సహా అనేక ఆడియో ఫీచర్లు కూడా ఉన్నాయి: స్మార్ట్ టీవీలో 24 వాట్స్ స్పీకర్‌లు ఉన్నాయి. అందుకే థియేటర్ అనుభవాన్ని అందించే ఈ అద్భుతమైన సౌండ్ క్వాలిటీ అందించే స్మార్ట్ టీవీ ఇది.

అలాగే, ఈ TV Wi-Fi 802.11 ac, AirPlay 2, Miracast, Bluetooth 5.0, HDMI పోర్ట్, USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఈథర్నెట్, యాంటెన్నాతో సహా అనేక కనెక్టివిటీ సపోర్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Summer Sale Live Now. Huge Discount Up To 44percent Offer On 43Inch Redmi Smart Fire TV 4K
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X