అమెజాన్ ‘కిరాణా’ మంత్రం

Posted By:

అమెజాన్ ‘కిరాణా’ మంత్రం

భారత ఈ-కామర్స్ రంగాన్ని సరికొత్త సంస్కరణల వైపు నడిపించే లక్ష్యంతో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ ఇండియా (Amazon India) వ్యూహాత్మక ఆలోచనతో ముందుకొచ్చింది. తమ షాపింగ్ పోర్టల్‌లో ఆర్డర్  చేసుకున్న గృహోపకరణాలను నెటిజనులు తమకు దగ్గరలో ఉన్న స్థానిక కిరాణా దుకాణాలలో ఆ వస్తువులను పొందే విధంగా అమెజాన్ కసరత్తుల చేస్తోంది. ప్రస్తుతం ఈ పైలెట్ ప్రాజెక్టును బెంగుళూరులో పరిశీలిస్తున్నారు.

వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఈ సదుపాయాన్ని దేశ వ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించజేసే యోచనలో అమెజాన్ ఉంది. వినియోగదారులకు వేగవంతమైన ఇంకా సౌకర్యవంతమైన సేవలను అందించే లక్ష్యంతో వినూత్న ఆలోచనల వైపు అడుగులువెస్తున్నట్లు అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ ఓ ప్రముఖ ప్రతికకు తెలిపారు. ఈ ప్రయోగాత్మక విధానంలో భాగంగా అమెజాన్ ఇండియా ఆయా ప్రాంతాల్లోని స్థానిక కిరాణా స్టోర్లతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting