అమెజాన్ రూల్స్ మారాయి,బుక్ చేసేముందు ఓ సారి తెలుసుకోండి

|

ఈ కామర్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతున్న అమెజాన్ సరికొత్తగా ఓ రూల్‌ని ప్రవేశపెట్టింది. ఫ్లిప్‌కార్ట్‌తో అనివార్యమైన పోటీ అలాగే డెలివరీ సమయంలో జరుగుతున్న అవకతవకల నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మోసాలను అరికట్టేందుకు ఈ రకమైన ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. విషయంలోకి వెళితే.. అమెజాన్‌ ఇండియాలో మొబైల్‌ ఫోన్‌ కానీ, ల్యాప్‌టాప్‌ కానీ లేదా ఇతర ఏదైనా ఖరీదైన వస్తువు కొనే యూజర్లు ఇక నుంచి డెలివరీని ధృవీకరించడానికి ఆరు అంకెల ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

 

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?

వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్(ఓటీపీ)

వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్(ఓటీపీ)

కొనుగోలుదారులకు మరింత సురక్షితమైన షాపింగ్‌ అనుభవాన్ని అందించడం కోసం అ‍త్యంత విలువైన ఆర్డర్లకు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్(ఎటీపీ)ని అమెజాన్‌ ఇండియా ఇవ్వడం ప్రారంభించింది.

ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తుల కోసం

ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తుల కోసం

కొన్ని కేటగిరీల్లో ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తుల కోసం ఈ కొత్త ఓటీపీ ఫీచర్‌ను అమెజాన్‌ ఇండియా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా ఎక్కువ విలువ ఉన్న వస్తువులు బుక్ చేసినప్పుడు వారు డెలివరీ ఏజెంట్లు డివైజ్‌లో ఓటీపీని నమోదుచేసి, డెలివరీని ధృవీకరించాల్సి ఉంటుంది.

ఆరు అంకెల ఓటీపీ
 

ఆరు అంకెల ఓటీపీ

ఆర్డర్‌ను ధృవీకరించడానికి అమెజాన్‌ ఇండియానే ఆరు అంకెల ఓటీపీని మెసేజ్‌ రూపంలో అందిస్తోంది. ఈ ఓటీపీని డెలివరీ ఏజెంట్ల డివైజ్‌లో కస్టమర్లు నమోదు చేసి, తమ ప్రొడక్ట్‌ను తీసుకోవాలి. ఈ విషయాన్ని అమెజాన్‌ అధికార ప్రతినిధి గాడ్జెట్స్‌ 360కి ధృవీకరించారు.

సురక్షితంగా డెలివరీ

సురక్షితంగా డెలివరీ

కస్టమర్‌ సెంట్రిక్‌ కంపెనీ అయిన అమెజాన్‌, కస్టమర్లందరికీ సురక్షితంగా డెలివరీని అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని ఆర్డర్లకు ప్రస్తుతం ఓటీపీ ఆధారిత డెలివరీ మెకానిజం తీసుకొచ్చాం.

రిజిస్ట్రర్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు

రిజిస్ట్రర్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు

కస్టమర్‌ రిజిస్ట్రర్‌ చేసిన మొబైల్‌ నెంబర్‌కు లేదా ఈమెయిల్‌ అడ్రస్‌కు ఈ ఓటీపీ పంపుతాం. దీన్ని డెలివరీని అంగీకరించినట్టు తెలుసుకునేందుకు వాడుతున్నాం' అని అధికార ప్రతినిధి చెప్పారు.

ఐదో వార్షికోత్సవాన్ని

ఐదో వార్షికోత్సవాన్ని

కాగా ఈ నెల మొదట్లోనే అమెజాన్‌ ఇండియా తన ఐదో వార్షికోత్సవాన్నిసెలబ్రేట్‌ చేసుకుంది. ఈ సందర్భంగా డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా తమ ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో వెయ్యి రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి 250 రూపాయల క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ ..

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ ..

గత రెండేళ్ల కాలంలో భారత్‌లో ఎక్కువగా సందర్శించిన సైట్‌ల్లో అమెజాన్‌.ఇన్‌ను నిలిపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ ఇండియా సైట్‌లో లేఖ పోస్టు చేశారు.

Best Mobiles in India

English summary
Amazon India Now Requires OTP to Complete High-Value Order Deliveries, Adds 'No Rush Delivery' Option More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X