Amazon నుంచి మెసేజింగ్ యాప్ రాబోతోంది!
వాట్సాప్, ఫేస్‌బుక్‌లను బీట్ చేసేదిగా...
Amazon.com నుంచి సరికొత్త మెసేజింగ్ యాప్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం. Anytime పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుందట. ఈ మెసేజింగ్ యాప్ ఎలా ఉండాలి అనే దాని పై కస్టమర్‌ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓ సర్వేను కూడా అమెజాన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అతిత్వరలో పబ్లిక్‌లోకి రాబోతున్న ఈ యాప్ అన్ని రకాల సదుపాయాలతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లను బీట్ చేసేదిగా ఉంటుందని వినికిడి. ఆన్‌లైన్ షాపింగ్, మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫోటో షేరింగ్, ఫోటో ఎడిటింగ్, స్టిక్కర్స్, జిఫ్ ఫైల్ సపోర్ట్, గేమ్స్ ఇలా అన్ని రకాల సదుపాయాలు ఈ యాప్‌లో ఉంటాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








