బాబోయ్ కొబ్బరి చిప్ప రూ.1,365...?షాక్ లో ఇండియన్స్
ఏవండోయ్ మీరు దేవుడికి కొబ్బరికాయ కొట్టి చిప్ప పడేస్తున్నారా...అయితే మీరు నష్టపోయినట్టే...కొబ్బరి చిప్ప పడేస్తే నష్టపోవడం ఏంటి అనుకుంటున్నారా...
ఏవండోయ్ మీరు దేవుడికి కొబ్బరికాయ కొట్టి చిప్ప పడేస్తున్నారా...అయితే మీరు నష్టపోయినట్టే...కొబ్బరి చిప్ప పడేస్తే నష్టపోవడం ఏంటి అనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ చూడండి

అమెజాన్ రూ.1365 కి అమ్ముతుంది...
దేవుడికి కొబ్బరి కాయ కొడితే అదృష్టం కలిసొస్తుంధో లేదో తెలియదు కానీ కోట్టిన చిప్ప పడేస్తా మాత్రం మీకు దురదృష్టమే.ఎందుకంటే మనం ఎందుకు పనికి రాదని చిప్ప ని అమెజాన్ రూ.1365 కి అమ్ముతుంది.కనీసం దానికి ప్రత్యేక రంగులు, ఇతర హంగులేమీ అద్దలేదు. ఈ కొబ్బరి చిప్పను ఆన్‌లైన్‌లో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయి దాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు.

అసలు ఖరీదు రూ.3000....
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.ఈ చిప్ప అసలు ఖరీదు రూ.3000. 55 శాతం ఆఫర్‌లో భాగంగా రూ.1,365కి లభిస్తోంది . పైగా దీని సైజు కూడా ఒకటిన్నర అంగుళాల ఎత్తు, నాలుగున్నర అంగుళాల వెడల్పు మాత్రమే. ఓ వంద మిల్లీ లీటర్ల నీళ్లు పట్టేంత ఖాళీ మాత్రమే ఉంటుంది.
ట్వీట్స్....
నెటిజనులు చేసిన ఈ ట్వీట్స్ ను చూడండి

గతంలో ‘వెలెంటినో’ కంపెనీ చెప్పుల గురించి కూడా ట్విట్టర్ లో ఆడుకున్నారు...
అమెజాన్‌లో విక్రయిస్తున్న ‘వెలెంటినో' కంపెనీ హవాయి చెప్పుల ధర ఏకంగా రూ. 72,225.33 కాగా ఇంతకముందు వీటి ధర రూ.45,393 మాత్రమే.కానీ వెట్టిని రూ.27 వేలు అమెజాన్ పెంచేసింది. బాత్రూమ్ చెప్పులు ఇంత ధరా అంటూ పలువురు నెటిజన్లు అప్పట్లో తెగ
ఆడుకున్నారు.


Click it and Unblock the Notifications








