అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్.. ధర, ప్రయోజనాల వివరాలు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అమెజాన్ మెంబర్ షిప్ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ కొత్త ప్లాన్‌పై వార్తలొచ్చాయి. ఇందుకు అనుగుణంగానే అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నట్లుగా సుమారు అన్ని ప్రయోజనాలు ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం తెలిపింది. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ ఇప్పటి వరకు కొంతమందికే అందుబాటులో ఉందని.. ఇక నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అమెజాన్ తెలిపింది. ఈ ప్లాన్ మరిన్ని వివరాలు మీకోసం.

అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ కోసం కేవలం రూ.999 చెల్లించి, 12 నెలలపాటు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్‌లో కేవలం 12నెలలకు సంబంధించిన ప్లాన్ మాత్రమే ఉందని.. నెలవారీ లేదా మూడు నెలల ప్లాన్‌లు లేవని సంస్థ తెలిపింది. అదే ప్రైమ్ మెంబర్‌షిప్‌లో 12 నెలల ప్లాన్ ధర 1499 రూపాయలుగా ఉంది. లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ 12 నెలల ప్లాన్‌తో రూ.500 ఆదా చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్ ప్రయోజనాలు : అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ తీసుకున్న వారు రెండు రోజుల్లో ఉచితంగా డెలివరీలు పొందగలరని అమెజాన్ తెలిపింది. మరియు ఈ ప్లాన్‌లో భాగంగా రూ.25 క్యాష్‌బ్యాక్ పొందగలరని అమెజాన్ పేర్కొంది.
* ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ వినియోగదారులు.. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందుతారని తెలిపింది. డిజిటల్ మరియు గిఫ్ట్ కార్డుపై కొనుగోళ్లుపై ఇప్పటికే 2 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతున్నట్లు అమెజాన్ పేర్కొంది.
* అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ద్వారా అన్‌లిమిటెడ్ వీడియో కంటెంట్, సినిమాలు, టీవీ షోలు చూసుకోవచ్చని తెలిపింది. రెండు పరికరాల్లో (ఫోన్ లేదా ట్యాబ్) లైట్ మెంబర్‌షిప్ వినియోగించుకోవచ్చని మరియ హెచ్‌డీ క్వాలిటీ కంటెంట్‌ను వీక్షించవచ్చని పేర్కొంది. ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ద్వారా అమెజాన్ ఇండియా డీల్స్‌ను త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చని, మరియు కేవలం ప్రైమ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన సేల్‌లో పాల్గొనవచ్చని అమెజాన్ తెలిపింది.
* అయితే అమెజాన్ మెంబర్‌షిప్‌లో వేగవంతమైన డెలివరీ, ఒక్కరోజు డెలివరీ సేవలు, అదే రోజు డెలివరీ చేసే సదుపాయం వంటివి సౌకర్యాలు ఉంటాయి. అయితే లైట్ మెంబర్‌షిప్ తీసుకున్నవారు ఇటువంటి సదుపాయాలను పొందలేదని అమెజాన్ వెల్లడించింది. ఇదే కాకుండా అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్‌తో ప్రైమ్ రీడింగ్, అమెజాన్ మ్యూజిక్‌కు యాక్సెస్ పొందలేదు.
* అదే ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగిన వారు ఆరు పరికరాల వరకు వినియోగించుకోవచ్చు. మరియు 4k నాణ్యత కలిగిన కంటెంట్‌ను వీక్షించవచ్చు. మరియు ఎలాంటి ప్రకటనలు ఉండవు. మరియు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి నో కాస్ట్ EMI, స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు కొన్ని గేమింగ్ ఆఫర్‌లను పొందుతారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications