మొదలైన Amazon Great Summer sale.. 75% వరకు భారీ డిస్కౌంట్స్..!
Amazon Great Summer Sale 2025: ఈ ఏడాది వేసవి కొనుగోళ్లకు సిద్ధమవుతున్న వినియోగదారులకు అమెజాన్ శుభవార్త తెచ్చింది. ప్రతి ఏడాది ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్( Amazon Great Summer Sale) 2025 అధికారికంగా ప్రారంభమైంది. ఇక ప్రైమ్ సభ్యుల కోసం ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే ఎర్లీ యాక్సెస్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఉచిత యూజర్లకు ఈ సేల్ నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ భారీ డీల్స్, డిస్కౌంట్లను అందిస్తోంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, హెడ్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సెస్ ఇంకా స్మార్ట్ టీవీలు వంటి విభాగాలపై గరిష్ఠంగా 75% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఏ ప్రొడక్ట్స్ ఫై ఆఫర్స్ అందుబాటులో?
ప్రత్యేకంగా అమెజాన్ బ్రాండ్ అలెక్సా (Alexa) స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్, ఎకో షో స్పీకర్లపై ప్రత్యేక డీల్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండటంతో, మరింత తగ్గిన ధరకు కొనుగోలు చేసే అవకాశముంది. మరి ఏ ఫోన్ ఎంత డిస్కౌంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,19,000 లోపలే పొందవచ్చు. ఈ ఫోన్ 6.9-అంగుళాల డిస్‌ప్లే, పవర్‌ఫుల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 10MP 3x టెలిఫోటో లెన్స్, 12MP సెల్ఫీ కెమెరాతో పాటు.. 5,000mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్)తో లభిస్తుంది.
అలాగే ఐఫోన్ 16 ను రూ.72,900లకే పొందవచ్చు. ఈ ఫోన్ 6.1- అంగుళాల OLED డిస్‌ప్లే, ఆపిల్ A18 బియోనిక్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో ఇంకా 48MP మెయిన్ కెమెరా, 12MP మ్యాక్రో లెన్స్‌తో ఫోటోగ్రఫీ కోసం బాగుంది. 12MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
ఈ సేల్ లో భాగంగా ఐఫోన్ 16e మోడల్‌ను రూ.53,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.1- అంగుళాల OLED డిస్‌ప్లే, ఆపిల్ A18 చిప్‌సెట్, అల్యూమినియం బిల్డ్ డిజైన్ ఉంది. 48MP మెయిన్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో ఫేస్ ఐడి సపోర్ట్ కూడా ఉంటుంది.
అంతేకాకుండా ఐఫోన్ 16 ప్రో ను రూ.1,12,900 ధరకు పొందవచ్చు. ఈ ఫోన్ 6.3- అంగుళాల LTPO OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ A18 Pro చిప్‌సెట్‌తో, 48MP ప్రైమరీ, 12MP పెరిస్కోప్ టెలిఫోటో, 48MP అల్ట్రావైడ్ లెన్స్ వంటి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
చివరిగా, OnePlus 13 ఫోన్‌ను రూ.64,999 ధరకే పొందవచ్చు. ఇది 6.82 అంగుళాల QHD+ LTPO 3K డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీ ఉంటుంది, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
హోమ్ అప్లయెన్సెస్, టీవీలపై భారీ ఆఫర్లు :
ఏసీలు, ఫ్రిడ్జిలు, వాషింగ్ మెషిన్లపై గరిష్టంగా 65% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రత్యేకంగా టీజింగ్ చేసినట్లు స్మార్ట్ టీవీల పై ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
గాడ్జెట్లు, అమెజాన్ ప్రొడక్ట్స్ :
Alexa స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్, ఎకో షో వంటి ప్రోడక్ట్స్ పై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటితో పాటు హెడ్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి గాడ్జెట్లపై 75% వరకు తగ్గింపు ఉండబోతోంది.
మొత్తంగా ఈ 2025 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో ప్రతీ ఒక్కరూ తమకు కావలసిన ప్రొడక్ట్స్ ను భారీ తగ్గింపుతో పొందవచ్చు. ప్రైమ్ సభ్యులకు ముందుగా యాక్సెస్ రావడం వల్ల వారు మరిన్ని ప్రత్యేక డీల్స్‌ను పొందవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీ ఫేవరెట్ ప్రొడక్ట్స్‌పై బెస్ట్ డీల్స్ కోసం అమెజాన్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








