ఇండియాలో ఉచితంగా మినీటివి వీడియో స్ట్రీమింగ్ ను ప్రారంభించిన అమెజాన్
భారతదేశంలో అమెజాన్ మినీటివి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇప్పుడు కొత్తగా ప్రారంభించారు. ఇది వెబ్ సిరీస్, కామెడీ షోలతో పాటు బ్యూటీ మరియు ఫ్యాషన్ వీడియోలను ప్రదర్శిస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అమెజాన్ షాపింగ్ యాప్ లో ఈ కొత్త మినీటీవీ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇది ఉచితంగా లభించడమే కాకుండా ప్రకటనల ద్వారా కూడా మద్దతును ఇస్తుంది. మినీటివి బ్యానర్ అమెజాన్ యాప్ యొక్క హోమ్‌పేజీలో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు నేరుగా మినీటివి ల్యాండింగ్ పేజీకి మళ్ళించబడుతారు. ఆశిష్ చంచలాని, ప్రజక్త కోలి, సెజల్ కుమార్ మరియు మాల్వికా సిట్లాని వంటి అగ్ర యూట్యూబ్ సృష్టికర్తల యొక్క కంటెంట్ ఇందులో ప్రసారం చేస్తున్నారు.

అమెజాన్ మినీటివి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం అమెజాన్ యొక్క ప్రైమ్ వీడియో కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఇది ఉచితంగా లభిస్తుంది. ప్రైమ్ వీడియో అనేది ప్రైమ్ సభ్యత్వంతో మాత్రమే యాక్సెస్ చేయగల ప్రత్యేక యాప్. అమెజాన్ ప్రైమ్ ను మూడు నెలలకు రూ. 329 మరియు సంవత్సరానికి రూ.999 ధర వద్ద పొందవచ్చు. ప్రైమ్ వీడియో అనేది అమెజాన్ ఒరిజినల్స్ మరియు ఇతర ప్రత్యేకమైన కంటెంట్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. మరోవైపు మినీటివి అనేది వెబ్-సిరీస్, కామెడీ షోలు, టెక్ న్యూస్, ఫుడ్, బ్యూటీ మరియు ఫ్యాషన్ వీడియోల క్యూరేటర్ లకు యాక్సిస్ ను ఇస్తుంది. వీటిని ఇప్పుడు అమెజాన్ యాప్ నుండి చూడవచ్చు.

అమెజాన్ యొక్క మినీటీవీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ప్రస్తుతం అమెజాన్ యాప్ వినియోగదారులకు ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే నెలల్లో ఈ సర్వీస్ iOS యాప్ మరియు వెబ్‌లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

మినీటివిలోని ప్రముఖ వీడియో స్టూడియోల జాబితాలో టివిఎఫ్, పాకెట్ ఏసెస్ మరియు ప్రముఖ హాస్యనటులైన ఆశిష్ చంచలాని, అమిత్ భదానా, రౌండ్ 2 హెల్, హర్ష్ బెనివాల్, శ్రుతి అర్జున్ ఆనంద్, ఎల్విష్ యాదవ్, ప్రజక్త కోలి, స్వాగర్ శర్మ, ఆకాష్ గుప్తా, మరియు నిశాంతర్ వంటి వారి యొక్క వీడియోలు ఉన్నాయి. టెక్ నిపుణుడు ట్రాకిన్ టెక్ వంటి యూట్యూబర్స్, ఫ్యాషన్ మరియు బ్యూటీ నిపుణులైన సెజల్ కుమార్, మాల్వికా సిట్లాని, జోవిటా జార్జ్, ప్రేర్నా ఛబ్రా, మరియు శివశక్తి కూడా అమెజాన్.ఇన్ యొక్క మినీటివిలో కనిపిస్తాయి. ఆహారం రెసిపీ కంటెంట్ కోసం అమెజాన్ కబిటాస్ కిచెన్, కుక్ విత్ నిషా మరియు గోబుల్ నుండి వీడియోలను క్యూరేట్ చేసింది.


Click it and Unblock the Notifications








