Home
News

అమెజాన్ నుంచి కొత్తగా బజార్‌.. అత్యంత తక్కువ ధరలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం..!!

ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ తాజాగా మరో షాపింగ్‌ ప్లాట్‌ఫాంను లాంచ్‌ చేసింది. బజార్‌ పేరుతో (Amazon Bazaar launched) లాంచ్‌ చేసింది. ఇందులో తక్కువ ధర కలిగిన ఉత్పత్తులను విక్రయించనుంది. ప్రస్తుతం ఈ తరహా సేవల్ని మీషో (Meesho) సహా మరిన్ని సంస్థలు అందిస్తున్నాయి.

అమెజాన్‌ ద్వారానే యాక్సెస్ చేయవచ్చు.. :
అయితే ఈ బజార్‌ ప్లాట్‌ఫాం కోసం అమెజాన్‌ ప్రత్యేకంగా ఎటువంటి యాప్‌ను విడుదల చేయలేదు. అమెజాన్‌ యాప్‌ ద్వారానే ఈ బజార్‌ ప్లాట్‌ఫాంను యాక్సెస్‌ చేయవచ్చు. వస్త్రాలు, జ్యూయలరీ, బ్యాగ్స్‌, షూష్‌ వంటి అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు కిచెన్‌ను సంబంధించిన ఉత్పత్తులు, బెడ్‌షీట్స్‌ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

Amazon new affordable platform bazaar launched in india

వినూత్న అంశాలపై తమ పెట్టుబడులు కొనసాగిస్తామని అమెజాన్‌ సంస్థ తెలిపింది. అమెజాన్ బజార్‌లో అత్యంత అందుబాటు ధరకే కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. ప్రత్యేకంగా భారత్‌లో తయారుచేసిన ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని అమెజాన్ అధికార ప్రతినిధి వెల్లడించింది. అమెజాన్ ద్వారానే బజార్‌ ప్లాట్‌ఫాంను యాక్సెస్‌ చేయవచ్చు.

ఈ కొత్త బజార్‌ ప్లాట్‌ఫాంను ఎలా యాక్సెస్‌ చేయాలంటే తొలుత అమెజాన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అక్కడ కనిపించిన బజార్‌ ఐకాన్ పైన క్లిక్‌ చేయాలి. అక్కడ అత్యంత అందుబాటు ధరకే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్లాట్‌ఫాం ద్వారా డెలివరీకి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. అయితే వివరాలు తెలియాల్సి ఉంది.

Amazon new affordable platform bazaar launched in india

అమెజాన్‌లో ప్రైమ్‌ మెంబర్లకు ప్రస్తుతం రెండు రోజులకే డెలివరీ చేస్తున్నారు. అదే బజార్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు 4-5 రోజుల పాటు డెలివరీకి సమయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే నాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు వస్తువును డెలివరీ చేసేందుకు ఇంకా ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంది.

మీషో ద్వారా ఆర్డర్‌ చేసిన ఉత్పత్తులు కొన్నిసార్లు 4-5 రోజుల్లో డెలివరీ అవుతుండగా.. మరికొన్నిసార్లు వారాలపాటు ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే మీషోలో వేగంగా డెలివరీ చేసేందుకు ఎటువంటి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో లేవు. అయితే కొన్నిసార్లు ఆర్డర్‌ చేసిన రెండు రోజుల్లోనే డెలివరీ చేస్తోంది.

ఈ బజార్‌ ప్లాట్‌ ఫాం ద్వారా మీషో, ఫ్లిప్‌ కార్ట్ కు చెందిన Shopsy యాప్‌, Ajioకు చెందిన Ajio street వంటి ప్లాట్‌ఫాంలకు పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. తొలుత పట్టణాలకే పరిమితమైన ఈ వ్యాపారం క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon launches new platform called bazaar to compete with meesho and otther
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X