‘అమెజాన్’ కొత్త సర్వీసులు ప్రారంభం!!

Posted By: Super

 ‘అమెజాన్’ కొత్త సర్వీసులు ప్రారంభం!!

భారత రిటైల్ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ రంగంలోకి దిగింది. భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సర్వీసులు ప్రారంభించింది. జంగ్లీ డాట్‌కామ్ పోర్టల్ ద్వారా 1.2 కోట్ల పైగా దేశీ, విదేశీ ఉత్పత్తుల సమాచారాన్ని అందించనుంది.

ఈ సైట్‌లో ఉత్పత్తులకు సంబంధించిన సమీక్షలు, ధరలు, రవాణా వ్యవధి మొదలైన వివరాలన్నీ ఉంటాయని అమెజాన్ డాట్‌కామ్ వైస్-ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. భారతీయ విక్రేతలు ఇందులో తమ ఉత్పత్తులు, సర్వీసులను లిస్ట్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. 25 విభాగాల కింద.. హోమ్‌షాప్ 18, బాటా ఇండియా, డాబర్, రీబాక్ మొదలైన 14,000 పైచిలుకు దేశీ, విదేశీ బ్రాండ్ల ఉత్పత్తులు జంగ్లీ డాట్‌కామ్‌లో అందుబాటులో ఉంటాయని అగర్వాల్ చెప్పారు. అమెజాన్‌డాట్‌కామ్‌కి హైదరాబాద్‌లో కూడా కార్యాలయం ఉంది. జంగ్లీ డాట్‌కామ్ నేరుగా అమ్మకాలు జరపబోదు. ఇది విక్రేతలు, కొనుగోలుదార్లకు మధ్య అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించనుంది. కొనుగోలు లావాదేవీలన్నీ విక్రేత వెబ్‌సైట్‌లోనే జరుగుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot