Home
News

Amazon Prime నెలవారీ, ఏడాది ప్లాన్లపై 50 శాతం క్యాష్‌బ్యాక్‌..!!

అమెజాన్‌ ఇండియా ఈనెల 15, 16 తేదీల్లో ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌ పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌పై ఆఫర్‌ ప్రకటించింది. యాత్‌ ఆఫర్‌ పేరుతో నెలవారీ మరియు సంవత్సరం ప్లాన్లకు 50 శాతం తగ్గింపును ఇవ్వనుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ నెలవారీ ప్లాన్‌ కోసం సాధారణంగా రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. అదే సంవత్సరం ప్లాన్‌ కోసం రూ.1499 చెల్లించాలి. ఫలితంగా ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌ మ్యూజిక్‌తోపాటు అమెజాన్‌ ప్రత్యేక సేల్‌కు ముందస్తుగా యాక్సెస్‌ మరియు అమెజాన్‌ నుంచి బుకింగ్‌ చేసే వస్తువులపై ఉచిత డెలివరీలు పొందవచ్చు.

Amazon offers 50 percent cashback

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొనేందుకు యువతను ఆకర్షించేలా యూత్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ ఆఫర్‌ పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది. యాత్‌ ఆఫర్‌కు అర్హత సాధించిన వారు నెలవారీ ప్రైమ్ మెంబర్‌షిప్‌పై 150 రూపాయలు, సంవత్సర మెంబర్‌షిప్‌పై రూ.750కు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందేందుకు అమెజాన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ పైన క్లిక్‌ చేయాలి. అనంతరం నెలవారీ లేదా ఏడాది ప్లాన్‌ను ఎంచుకోవాలి. అనంతరం నగదు చెల్లించాలి. అయితే ఈ యూత్‌ ఆఫర్‌ కోసం సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.

అర్హత సాధించిన వారు 50శాతం క్యాష్‌బ్యాక్‌ పొందుతారు. అయితే ఈ ఆఫర్‌ను పొందేందుకు 15రోజుల్లో వయస్సుకు సంబంధించిన ధృవీకరణ పూర్తిచేయాల్సి ఉంటుందని అమెజాన్‌ తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ పే గిఫ్ట్‌ కార్డు రూపంలో వినియోగదారులకు జమ అవుతుందని అమెజాన్‌ తెలిపింది.

అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌ జులై 15 అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై.. జులై 16 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఫ్యాషన్‌, గృహ ఉపకరణాలు సహా ఇతర వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్‌, ఆఫర్లను ఇస్తున్నట్లు ప్రకటించింది.

400 రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. వన్‌ప్లస్‌, ఐకూ, రియల్‌మీ, శాంసంగ్‌, మోటోరోలా, బోట్‌, సోనీ, అలెన్‌సోలీ, లైఫ్‌స్ట్రైల్‌, టైటాన్‌, ఫాజిల్‌, పుమా, టాటా, డాబర్ సహా మరెన్నో బ్రాండ్లు ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేయవచ్చునని అమెజాన్‌ తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంకు కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు 10 శాతం డిస్కౌండ్‌ పొందుతారని వెల్లడించింది. అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసినా కూడా 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందుతారని పేర్కొంది.

ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసిన వస్తువులు అత్యంత వేగంగా డెలివరీ చేస్తామని అమెజాన్‌ వెల్లడించింది. దేశంలోని 25 నగరాల నుంచి ఆర్డర్లు చేసే వారు అదే రోజు లేదా తర్వాత రోజు డెలివరీ చేస్తామని ప్రకటించింది. టైర్‌ 2 నగరాల్లో 24 నుంచి 48 గంటల్లో డెలివరీ చేస్తామని వెల్లడించింది.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న 18 ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసుల్లో యాడ్‌ ఆన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలుపై 50 శాతం తగ్గింపును పొందుతారని పేర్కొంది. అలాగే అమెజాన్‌ ఉత్పత్తులు ఎకో, ఫైర్‌ టీవీ సహా మరిన్ని పరికరాలు, బ్రాండ్లపై 55 శాతం తగ్గింపును పొందుతారని అమెజాన్ ప్రకటించింది.

రియల్‌మీ నార్జో N50, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ 5G, వన్‌ప్లస్‌ 11R 5g, ఐఫోన్‌ 14, శాంసంగ్‌ గెలాక్సీ S20 FE, రెడ్‌మీ 12C, శాంసంగ్‌ గెలాక్సీ M33. రెడ్‌మీ నోట్‌ 12 5G, లావా బ్లేజ్‌, టెక్నో స్పార్క్ 9, ఒప్పో A78 5G సహా మరెన్నో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందుతారని అమెజాన్‌ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon offers 50 percent cashback on monthly and yearly prime plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X