ధర రూ.7299 కే 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. సేల్ వివరాలు..!
ఇటీవల కాలంలో అనేక స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి. తాజాగా టెక్నో స్పార్క్ Go 2024 స్మార్ట్ ఫోన్ (Tecno Spark Go 2024 Smartphone) తగ్గింపు ధరను పొందింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకే అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ Unisoc T606 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
టెక్నో స్పార్క్ గో స్పెసిఫికేషన్లు : టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆపిల్ తరహా డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

టెక్నో స్పార్క్ గో కెమెరా, బ్యాటరీ వివరాలు : కెమెరాల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 13MP ప్రైమరీ కెమెరా సహా డ్యూయల్ ఫ్లాష్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. హ్యాండ్ సెట్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో.. : ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ Unisoc T606 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13 పైన పనిచేస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

టెక్నో స్మార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ : కనెక్టివిటీ పరంగా ఈ టెక్నో స్పార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ వైఫై, బ్లూటూత్, USB-C ఛార్జింగ్ పోర్టు, హెడ్‌ఫోన్ జాక్ సహా భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆడియో ఎఫెక్ట్ కోసం DTS సౌండ్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంది.
టెక్నో స్మార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ ధర తగ్గింపు : టెక్నో స్మార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్‌లో రూ.8,499 గా ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై 14 శాతం తగ్గింపు ధరను ( Tecno Spark Go 2024 price Drop ) పొందింది. ఫలితంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.7299కే కొనుగోలు చేయవచ్చు. ఎంపికచేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications