Amazonలో ఫాద‌ర్స్ డే పోటీలో పాల్గొనండి.. ఆక‌ర్ష‌ణీయమైన బ‌హుమ‌తులు గెల‌వండి!

|

నాన్న అంటే ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో ఇష్ట‌మైన ప్ర‌త్యేకం. నాన్నంటే ఇష్టం లేని వారు ఎవ‌రూ ఉండ‌రనే చెప్ప‌వ‌చ్చు. త‌మ జీవితంలో ఎప్పుడో ఒక‌సారి నాన్న‌కి ఏదైనా స‌ర్‌ప్రైజ్‌ బ‌హుమ‌తి ఇచ్చి సంతోష పెట్టాల‌ని చాలా మంది తాప‌త్ర‌య ప‌డుతుంటారు. అలాంటి వారికి ఇదో మంచి వార్త‌. రాబోయే జూన్ 19తేదీన Fathers Day (నాన్న‌ల దినోత్స‌వం) సంద‌ర్భంగా Amazon స‌రికొత్త కాంపిటిష‌న్ తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా స్పిన్ అండ్ విన్ క్విజ్ కాంటెస్ట్ Amazon Spin & win Quiz ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన‌డం ద్వారా వినియోగ‌దారులు ఫాజిల్ మెన్స్ చేతి గ‌డియారం తో పాటు అమెజాన్ పే బాలెన్స్‌ను గెలుచుకోవ‌చ్చు.

 

పోటీ ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..

పోటీ ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..

ఫాద‌ర్స్‌డే Amazon Spin & win Quiz పోటీలో పాల్గొని బ‌హుమ‌తి పొంద‌డానికి అర్హ‌త సాధించాలంటే వినియోగ‌దారులు క్విజ్‌లో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది. పోటీలో పాల్గొనే వినియోగ‌దారులు గెలిచిన‌ట్ల‌యితే ఏదైనా ఒక బ‌హుమ‌తికి మాత్ర‌మే అర్హ‌త సాధిస్తారు. ఫాద‌ర్స్ డేను దృష్టిలో పెట్టుకుని నిర్వ‌హిస్తున్న ఈ Amazon Spin & win Quiz ప్రస్తుతం అమెజాన్ సైట్‌లో యాక్టివ్ గా ఉంది. ఈ కాంపిటిష‌న్ జూన్ 29వ తేదీ వర‌కు Amazon సైట్‌లో కొన‌సాగుతుంది. అయితే ఈ ఫాజిల్ వాచ్ గెలుపొంద‌డానికి స్పిన్ అండ్ విన్ క్విజ్‌లో ఎలా పాల్గొనాలో మ‌నం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గేమ్ ఎలా ఆడాలి..
 

ఈ గేమ్ ఎలా ఆడాలి..

* మొద‌ట‌గా Amazon వినియోగ‌దారులు త‌మ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉన్న Amazon యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో Amazon Quiz లు అందుబాటులో ఉంటాయి.
* ముందుగా యాప్‌లోని Home Page లో ఉన్నామో లేదో చూసుకోవాలి. ఆ త‌ర్వాత Menu సెక్ష‌న్‌లోని Fun Zone సెక్ష‌న్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు పోటీకి సంబంధించిన వివ‌రాల్ని క‌నుగొంటారు.
* ఈ స్టెప్‌లో మీరు New Game This Week సెక్ష‌న్‌లో ఫాద‌ర్స్ డే Amazon Spin & win Quiz పోటీని కనుగొంటారు. ఆ త‌ర్వాత పోటీ స్టార్ట్ బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ వెంట‌నే అక్క‌డ క‌నిపించే వీల్ ను స్పిన్ చేసి వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానాలు బ‌దులివ్వాలి.
* ఉదాహ‌ర‌ణ‌కు ఫాద‌ర్స్ డే ఎప్పుడు జ‌రుపుకుంటారు?
Ans: జూన్ 19వ తేదీన‌.

ఇప్పుడు బ‌హుమ‌తుల వివ‌రాలు తెలుసుకుందాం..

ఇప్పుడు బ‌హుమ‌తుల వివ‌రాలు తెలుసుకుందాం..

ఈ ఫాద‌ర్స్ డే పోటీలో గెలిచిన‌ తొలి విన్న‌ర్‌కు Fossil mens watch ఫాజిల్ మెన్స్ వాచ్ ఆఫ‌ర్ చేయ‌నున్నారు. మ‌రో న‌లుగురు విజేత‌ల‌కు రూ.5వేల అమెజాన్ పే బాల‌న్స్ ఆఫ‌ర్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత మ‌రో 500 మంది విజేత‌ల‌కు రూ.500 అమెజాన్ పే బాల‌న్స్ ఇవ్వ‌నున్నారు. అనంత‌ర 400 మంది విజేత‌ల‌కు రూ.50 పే బాల‌న్స్ న‌గ‌దు. మ‌రో 500 మందికి రూ.20 అమెజాన్ పే బాల‌న్స్ న‌గ‌దు ఆఫ‌ర్ చేయ‌నున్నారు.

బ‌హుమ‌తి ఎలా క‌లెక్ట్ చేసుకోవాలి

బ‌హుమ‌తి ఎలా క‌లెక్ట్ చేసుకోవాలి

ఈ పోటీలో విజేత‌ల‌ను ర్యాండం గా లాట్ ప‌ద్ద‌తిలో ఎంపిక చేస్తారు. విజేత‌లను నిర్ద‌రించిన త‌ర్వాత వారిని టెక్స్ట్ లేదా ఈ మెయిల్ మెసేజ్ రూపంలో సంప్ర‌దిస్తారు. 2022, జూన్ 30 వ తేదీన విన్న‌ర్స్ సెక్ష‌న్ ట్యాబ్‌లో విజేత‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ఇక విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ఆగ‌స్టు 30, 2022 తేదీ లోపు పంపిస్తారు.

అమెజాన్ ఇంకా మ‌రిన్ని కాంపిటిష‌న్లు..

అమెజాన్ ఇంకా మ‌రిన్ని కాంపిటిష‌న్లు..

అమెజాన్ సంస్థ ఇవే కాకుండా త‌మ ప్లాట్‌ఫాం పై వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎన్నో పోటీల‌ను నిర్వ‌హిస్తోంది. పోటీలు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా గెలిచిన విజేత‌ల‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తులు అందిస్తోంది. ప్ర‌స్తుతం కూడా అమెజాన్ యాప్‌లో ఈ ఫాద‌ర్స్ డే స్పిన్ అండ్ విన్ క్విజ్ పోటీతో పాటుగా.. స్పిన్ అండ్ విన్ సోనీ హెడ్‌సెట్‌, జాక్‌పాట్‌, యోగా డే క్విజ్ వంటి గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Amazon offers Fossil watch in spin and win quiz game on occasion of fathers day

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X