OnePlus స్మార్ట్‌ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్.. 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ సహా కీలక స్పెసిఫికేషన్లు!
వన్‌ప్లస్ నుంచి ఇటీవల నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. వన్‌ప్లస్ 11 హ్యాండ్‌సెట్ పై (OnePlus 11 Smartphone) భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. డిస్కౌంట్, కూపన్లు సహా ఎక్స్చేంజీ ద్వారా ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.56,999 గా ఉంది. అయితే అమెజాన్‌లో (OnePlus 11 Smartphone Amazon Offer 2024) ఈ ఫోన్‌పైన డిస్కౌంట్ కింద రూ.2000 తగ్గించింది. ఫలితంగా ఫోన్ రూ.54,999 గా ఉంది. దీంతోపాటు రూ.4000 కూపన్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.50,999 గా ఉండనుంది.

దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.27,600 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే హ్యాండ్‌సెట్ కండిషన్ ఆధారంగా ఎక్స్చేంజీ ధర నిర్ణయించబడుతుందని అమెజాన్ తెలిపింది. అయితే ఈ వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ అనేక కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ ప్లూయడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5x ర్యామ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

8GB ర్యామ్ + 128 అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒకటిగా ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే 0-100 శాతం ఛార్జింగ్ పూర్తిచేయవచ్చు.
ఈ వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 60fps తో 4k వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాలను కలిగి ఉంది.
** రెండు రోజుల క్రితం వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి విడుదల అయింది. 2412*1080 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 210 టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్‌తో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే HDR 10+ కలర్ సర్టిఫికేషన్, 10 బిట్ కలర్ డెప్త్‌ను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ కొత్త హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో వచ్చింది. మరియు 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరాల నుంచి 30fps తో 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు. అదే ముందు కెమెరా ద్వారా 30fps తో 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు. కెమెరా విభాగం పరంగా మెరుగైన, నాణ్యమైన ఫోటోలను, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications