అమెజాన్ స్మార్ట్ మిర్రర్‌తో ఫ్యాషన్ కొత్త పుంతలు

Posted By: BOMMU SIVANJANEYULU

ఫ్యాషన్ ప్రపంచంలోకి అమెజాన్ తనదైన శైలిలో అడుగుపెట్టబోతోంది. ఈ సంస్థకు గ్రాంట్ అయిన స్మార్ట్ మిర్రర్ పేటెంట్, ఫ్యాషన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించబోతోంది. అమెజాన్ అభివృద్ధి చేసిన స్మార్ట్ మిర్రర్ టెక్నాలజీ యూజర్ ఎంపిక చేసుకున్న దస్తులు అతను దరిస్తే ఎలా ఉంటుంది అనేది వర్చువల్‌గా చూపించ గలుగుతుంది.

అమెజాన్ స్మార్ట్ మిర్రర్‌తో ఫ్యాషన్ కొత్త పుంతలు

గీక్‌వైర్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ స్మార్ట్ మిర్రర్ టెక్నాలజీ.. స్ర్కీన్స్, డిస్‌ప్లేస్, ప్రొజెక్టర్స్, కెమెరాస్ వంటి గాడ్జెట్‌ల కలయకతో పనిచేస్తుంది. ఈ సిస్టం వ్యక్తి పోలికలను వర్చువల్ ఇమేజెస్‌తో కంబైన్ చేసి బ్లెండెడ్-రియాల్టీ రిఫ్లెక్షన్‌ను ప్రెజెంట్ చేయగలుగుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా వివిధ రకాల వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్‌లలో వర్చువల్ అవుట్ ఫిట్‌లను ధరించి చూసుకునే వీలుంటుంది.

ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకువెళుతున్న అమెజాన్ ఈ మధ్య కాలంలో పలు ఫ్యాషన్-ఫోకసుడ్ ప్రోడక్ట్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రిటైలింగ్ సైడ్‌కు వచ్చేసరికి అమెజాన్ ఇప్పటికే తన సొంత ఫ్యాషన్ లేబుల్‌తో పాటు సొంత స్టిచ్ ఫిక్స్-లైక్-ఎట్-హోమ్ క్లాతింగ్ ట్రెయిల్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది.

జనవరి 9 నుంచి మారనున్న జియో ప్లాన్లు, లిస్ట్ ఇదే !

ఇక టెక్నాలజీ సైడ్‌కు వచ్చేసరికి అమెజాన్ ఇప్పటికే ఓ యాప్‌ను డెవలప్ చేసింది. ఈ యాప్ ఎటువంటి అవుట్ ఫిట్స్ మీకు పర్‌ఫెక్టుగా మ్యాచ్ అవుతాయో చెప్పగలుగుతుంది. అమెజాన్ ఈ మధ్య లాంచ్ చేసిన ఇకోలుక్ వాయిస్ కంట్రోల్డ్ కెమెరా మీ అవుట్ ఫిట్‌లకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను సేకరించి వాటిలో ఏ మోడల్ ధరించాలో కూడా చెబుతుంది.

English summary
Amazon's next move in the fashion world could be a mirror that shows how outfits will look on you without you having to actually put them on. GeekWire reports that the company has been granted a patent describing just that sort of technology.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot