డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం, అమెజాన్ సంచలనం
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ మరో సంచలనంతో దూసుకువచ్చింది.
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ మరో సంచలనంతో దూసుకువచ్చింది. ఇప్పటిదాకా క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని డెబిట్ కార్డులకు కూడా కల్పించింది. క్రెడిట్ కార్డు అవరం లేకుండా డెబిట్ కార్డు ద్వారా మీరు వస్తువులను ఈఎంఐ సదుపాయంలో కొనుగోలు చేయవచ్చు. నమ్మలేకున్నా ఇది నిజం. అమెజాన్‌లో ఇప్పుడు అమెజాన్ పే ఈఎంఐ పేరిట ఓ కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మరి దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం.

అమెజాన్ పే ఈఎంఐలో..
భారత్‌లో అమెజాన్ యాప్‌ను వాడుతున్న మొబైల్ యాజర్లు యాప్‌లోకి వెళ్లి అమెజాన్ పే ఈఎంఐలో రిజిస్టర్ చేసుకోవాలి. అందుకు గాను వారు తమ తమ ఆధార్, పాన్ వివరాలను ఇవ్వాలి.

క్రెడిట్ లిమిట్..
దీంతో అమెజాన్ పే ఈఎంఐ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు. అనంతరం నిర్దేశించిన మొత్తంలో క్రెడిట్ లిమిట్‌తో అమెజాన్ పే ఈఎంఐ యాక్టివేట్ అవుతుంది.

అకౌంట్‌కు డెబిట్ కార్డును లింక్
తరువాత యూజర్లు ఆ అకౌంట్‌కు తమ డెబిట్ కార్డును లింక్ చేయాలి. దీంతో ప్రాసెస్ పూర్తవుతుంది. తరువాత యూజర్లు అమెజాన్ పే ఈఎంఐ ఉపయోగించి అమెజాన్‌లో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

కనీసం రూ.8వేలు..
అమెజాన్ పే ఈఎంఐ విధానంలో వస్తువులను కొనాలంటే యూజర్లు కనీసం రూ.8వేలు ఆపైన విలువైన ఒకే వస్తువును మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

చెక్ అవుట్ చేసే సమయంలో..
అనంతరం చెక్ అవుట్ చేసే సమయంలో అమెజాన్ పే ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు..
ఆభరణాలు, గిఫ్ట్ కార్డులు, అమెజాన్ పే బ్యాలెన్స్‌కు అమెజాన్ పే ఈఎంఐ పనిచేయదని తెలుస్తోంది. కాబట్టి జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బ్యాంక్ లకు మాత్రమే..
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులకు మాత్రమే అమెజాన్ పే ఈఎంఐ లభిస్తున్నది.

అమెజాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే..
కేవలం అమెజాన్ మొబైల్ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తున్నారు.

త్వరలో ఫ్లిప్‌కార్ట్ కూడా..
త్వరలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఇదే తరహాలో ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్, ఫ్లిప్‌కార్ట్ ఫైనాన్స్ ఈఎంఐ పేరిట నూతన సదుపాయాలను ప్రవేశపెట్టనుందని సమాచారం.


Click it and Unblock the Notifications