Home
News

Amazon Quick Commerce క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అమెజాన్‌.. కోడ్‌నేమ్‌ ఏంటో తెలుసా..?

భారత్‌ లో ఇంట్లో అవసరాలకు గ్రామాలు, పట్టణాల్లోని కిరాణా దుకాణాలకు వెళ్తుంటారు. రోజువారీ అవసరాలతోపాటు నెలవారీ అవసరాల కోసం కిరాణా దుకాణాల నుంచే సరకులను కొనుగోలు చేసేవారు. అనంతరం మార్ట్‌లు, సూపర్‌ మార్కెట్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరాలు సహా పట్టణ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ రంగం (Quick Commerce) .. కిరాణా దుకాణాలు, సూపర్‌ మార్కెట్‌లు, మార్ట్‌ల స్థానాన్ని భర్తీ చేస్తోంది.

ఇప్పటికే అనేక సంస్థలు :
భారత్‌లో ఉన్న ట్రెండింగ్‌ రంగాల్లో క్విక్‌ కామర్స్ ఒకటిగా ఉంది. ఇప్పటికే అనేక సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్నాయి. భారత్‌ లో క్రమంగా క్విక్‌ కామర్స్‌ రంగం ఊపందుకుంటోంది. ఫలితంగా సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. భారత్‌లో క్విక్‌ కామర్స్‌ రంగంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోకు చెందిన బ్లింకింట్‌ (Blinkit), స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్‌ (instamart), జెప్టో (Zepto) సంస్థలు అగ్రస్థానంలో ఉన్నాయి.

Amazon expected to start quick commerce platform

ఎప్పటి నుంచో ప్రణాళికలు :
ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ (Amazon Quick Commerce) .. క్విక్‌ కామర్స్ రంగంలో ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. వివిధ కథనాలు, నివేదికల ఆధారంగా ఎప్పటి నుంచే ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ సేవలను తొలుత 2025 తొలి నాలుగు నెలల్లో లాంచ్‌ చేయాలని భావించినట్లు తెలిసింది.

సంభవ్‌ వార్షిక్ సమావేశంలో నిర్ణయం? :
అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న వివరాల ఆధారంగా డిసెంబర్‌ 9, 10 తేదీల్లో అమెజాన్‌ రివ్యూ మీటింగ్‌ లో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సంభవ్‌ పేరుతో అమెజాన్ వార్షిక సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం అమెజాన్‌ తేజ్‌ కోడ్‌నేమ్‌ తో క్విక్‌ కామర్స్‌ కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది.

సిబ్బంది నియామకాలు పూర్తి! :
ఇందుకోసం అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా అమెజాన్ చేపట్టినట్లు తెలుస్తోంది. మరియు క్విక్‌ కామర్స్‌ కోసం స్టాక్‌ కీపింగ్‌ యూనిట్‌ లు (SKU), డార్క్‌ స్టోర్‌ లు సహా ఇతర లాజిస్టిక్‌, ఇన్‌ఫ్రా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఏ పేరుతో అందుబాటులోకి తీసుకురానుందో సంస్థ వెల్లడించలేదు.

ఇప్పటికే అనేక సంస్థలు క్విక్‌ కామర్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మినిట్స్‌ (Minutes) పేరుతో క్విక్‌ కామర్స్‌ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రధాన నగరాలకు విస్తరించింది. టాటా న్యూ సూపర్‌ తోపాటు బిగ్‌బాస్కెట్‌ కూడా ఉన్నాయి.

మరో వైపు ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ కూడా క్విక్‌ కామర్స్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి $7 బిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనేక సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రానుందని భావిస్తున్న అమెజాన్‌ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం... వీటితో పోటీని ఎదుర్కొవాల్సి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon plans to launch quick commerce platform in india may finalise the launch date in smbhav meet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X