రూ 12,100 కోట్ల లాభాలతో చరిత్ర సృష్టించిన అమెజాన్

By Hazarath
|

ఈ కామర్స్ రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న అమెజాన్ చరిత్ర సృష్టించింది. అమెజాన్ చరిత్రలోనే తొలిసారిగా అధిక ఆదాయాన్ని ఆర్జించి తనకు ఈ కామర్స్ రంగంలో పోటీనే లేదని నిరూపించింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి 2 బిలియన్‌ డాలర్ల లాభాలను(రూ.12,100 కోట్లు) ఆర్జించినట్టు అమెజాన్‌ రిపోర్టు చేసింది. హాలిడే సీజన్‌ నేపథ్యంలో తన ప్రైమ్‌ ఫాస్ట్‌-షిప్పింగ్‌ క్లబ్‌ ద్వారా మిలియన్‌ కొద్దీ కస్టమర్లను చేర్చుకోవడం, అలాగే అమెరికా పన్ను చట్టం మార్పులు అమెజాన్‌కు సహకరించాయని కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ రికార్డులు సృష్టించడంతో, షేర్లు సైతం లాభాలు వర్షం కురిపిస్తున్నాయి.

 

నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ. 8 వేలు తగ్గింది, నోకియా 5 కూడా...నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ. 8 వేలు తగ్గింది, నోకియా 5 కూడా...

ప్రైమ్‌ మెంబర్లతోనే...

ప్రైమ్‌ మెంబర్లతోనే...

గతేడాది కొనుగోలు చేసిన హోల్‌ ఫుడ్స్‌ మార్కెట్‌లో ధరలు కోత, గ్రోసరీ విక్రయాలకు సహకరించినట్టు కూడా కంపెనీ పేర్కొంది. త్వరగా రవాణా, వెబ్‌సైట్‌ యూజర్లకు ఎక్స్‌క్లూజివ్‌గా టెలివిజన్‌ షోలు, కొత్త టెక్నాలజీలు, ప్రైమ్‌ మెంబర్లను ఎక్కువ వెచ్చింపుల​కు ఆకర్షించడం వంటివీ కంపెనీకి సహకరించాయి.

అలెక్సా డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రదర్శన..

అలెక్సా డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రదర్శన..

అలెక్సా డిజిటల్‌ అసిస్టెంట్‌ ప్రదర్శన అద్భుతంగా ఉందని, ఇతర కంపెనీలు, డెవలపర్లు అలెక్సాను స్వీకరించడం పెంచి తాము ఒక ముఖ్యమైన స్థాయికి చేరుకున్నామని అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తెలిపారు.

1.86 బిలియన్‌ డాలర్ల(రూ.11,923 కోట్లు) నికర ఆదాయం
 

1.86 బిలియన్‌ డాలర్ల(రూ.11,923 కోట్లు) నికర ఆదాయం

డిసెంబర్‌ 31తో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో 1.86 బిలియన్‌ డాలర్ల(రూ.11,923 కోట్లు) నికర ఆదాయం ఆర్జించినట్టు అమెజాన్‌ తెలిపింది. కాగా అమెజాన్‌కు ఇది మరో సంచలన క్వార్టర్‌ అని జీబీహెచ్‌ ఇన్‌సైట్స్‌ విశ్లేషకుడు డేనియల్ ఐవ్స్ చెప్పారు. అన్ని ఈ-కామర్స్‌ హాలిడే సీజన్‌ సేల్స్‌లో సుమారు 50 శాతం సంపాదించినట్టు ఆయన పేర్కొన్నారు.

విక్రయాలు ..

విక్రయాలు ..

విక్రయాలు కూడా అంచనాలను బీట్‌ చేసి 38 శాతం పెరిగి 60.5 బిలియన్‌ డాలర్ల(రూ.3.8 లక్షల కోట్లు)కు పెరిగాయి. రెవెన్యూల పరంగా కూడా ఈ క్వార్టరే అ‍త్యధికమని కంపెనీ తెలిపింది. ప్రైమ్‌కు గత క్వార్టర్‌లో వారంలో 4 మిలియన్లకు పైగా సైన్‌-అప్స్‌ వచ్చాయని, సబ్‌స్క్రిప్షన్‌ ఫీజులు కూడా 49 శాతం పెరిగి 3.2 బిలియన్‌ డాలర్లు(రూ.20,516 కోట్లు) వచ్చినట్టు అమెజాన్‌ పేర్కొంది.

 60 మిలియన్‌కు పైగా అమెరికన్‌ ప్రజలు..

60 మిలియన్‌కు పైగా అమెరికన్‌ ప్రజలు..

ఈ క్వార్టర్‌లో ఈ మొత్తం మరింత పెరుగుతుందని భావిస్తున్నామని, ఇటీవలే నెలవారీ ప్రైమ్‌ ప్లాన్స్‌ ఫీజులను అమెజాన్‌ పెంచిందని ఓ అనాలిస్ట్‌ చెప్పారు. 60 మిలియన్‌కు పైగా అమెరికన్‌ ప్రజలు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉన్నట్టు అంచనావేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 

ప్రకటనలు, ఇతర రెవెన్యూలు ..

ప్రకటనలు, ఇతర రెవెన్యూలు ..

ప్రకటనలు, ఇతర రెవెన్యూలు కూడా 62 శాతం పెరిగి 1.74 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కంపెనీ లాభాల మార్జిన్‌ పెరుగడానికి ప్రధాన కారణం అడ్వర్‌టైజింగ్‌లేనని అమెజాన్‌ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ బ్రియాన్ ఒల్సావ్స్కీ అన్నారు.

Best Mobiles in India

English summary
Amazon posts largest profit in its history on sales, tax boost

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X