అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 తేదీలు వచ్చేశాయ్.. ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్..!
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ఇండియా నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలో అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ తేదీలను కూడా వెల్లడించింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు సహా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ చెబుతోంది. తొలిసారిగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ ను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
సేల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? :
అమెజాన్ ఇండియా అందించిన వివరాల ఆధారంగా అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ జులై 12 వ తేదీ నుంచి 14 వ తేదీ 11:59 PM వరకు నిర్వహించనున్నారు. అమెజాన్ ప్రైమ్ మెంబర్ లు సుమారు 400 ప్రముఖ భారత, అంతర్జాతీయ బ్రాండ్స్ కు చెందిన వివిధ రకాల ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ చెబుతోంది.

ఈ బ్రాండ్స్ జాబితాలో శాంసంగ్, వన్‌ప్లస్, ఐకూ, బోట్, ఇంటెల్, HP, లెనోవో, అమెరికన్ టూరిస్టర్, Puma, Adidas సహా అనేక ప్రముఖ బ్రాండ్ లు ఉన్నాయి. వీటితోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయని అమెజాన్ చెబుతోంది.
బ్యాంకు ఆఫర్ల వివరాలు :
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్‌లో భాగంగా ICICI బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు మరియు SBI క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. దీంతోపాటు SBI, ICICI బ్యాంకు కార్డులతో EMI ట్రాన్సాక్షన్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుంది. సేల్ ఆఫర్లతోపాటు బ్యాంకు డిస్కౌంట్ ల ద్వారా మరింత తక్కువకే కొనుగోలు చేయవచ్చని అమెజాన్ వెల్లడించింది.
తొలిసారిగా మూడు రోజులపాటు! :
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ను తొలిసారిగా మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఫలితంగా ఎక్కువ మంది యూజర్లు ఈ సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, గృహోపకరణాలు, కిరాణా వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు యూజర్లకు ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపింది.
ఈ సేల్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఉత్పత్తులతోపాటు ఇప్పటికే సేల్‌లో ఉన్న ఉత్పత్తులను డిస్కౌంట్‌లకు కొనుగోలు చేయవచ్చు. చిన్న తరహా పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని అమెజాన్ చెబుతోంది. ఫలితంగా యూజర్లతోపాటు చిరు వ్యాపారులకు కూడా మేలు జరుగుతుందని భావిస్తోంది.
ఈ సేల్‌పై అమెజాన్ ఇండియాలో ప్రైమ్ ఫర్ ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ డైరెక్టర్ అక్షయ్ సాహి కీలక ప్రకటన చేశారు. కొత్త ఉత్పత్తుల లాంచ్, బ్లాక్‌బస్టర్ వినోదం నుంచి బెస్ట్ డీల్స్ ప్రయోజనాల వరకు అన్నింటినీ ప్రైమ్ యూజర్లు ఉపయోగించుకోవచ్చన్నారు. ప్రైమ్ మెంబర్లు ఆర్డర్ చేసిన రోజే డెలివరీ పొందడం సహా మరిన్ని ప్రయోజనాలను పొందుతున్నారు.


Click it and Unblock the Notifications