అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021: 5G స్మార్ట్‌ఫోన్‌లపై అధిక డిస్కౌంట్ ఆఫర్లు
స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయింది. టెక్నాలజీలో జరిగిన మార్పుల కారణంగా ఈ రోజుల్లో 5G స్మార్ట్‌ఫోన్‌లు అనేక పరిశ్రమలకు అపరిమితమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి మరియు వినియోగదారులు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండటానికి వీలు కల్పిస్తున్నాయి. వేగవంతమైన కనెక్టివిటీ మరియు అధిక బ్యాండ్‌విడ్త్‌తో ఈ టెక్నాలజీ వినియోగదారుల రోజువారీ అనుభవాలను మెరుగుపరుస్తుంది. మీరు 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం కోసం చూస్తున్నట్లయితే జూలై 26 మరియు జూలై 27 న నిర్వహించే అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్ మీకు అనువైన సమయం అని చెప్పవచ్చు. ఈ అమ్మకం సమయంలో మీరు వన్‌ప్లస్, షియోమి, ఆపిల్, శామ్‌సంగ్ సంస్థల యొక్క 5G స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 సందర్భంగా డిస్కౌంట్ ధర వద్ద లభించే ప్రసిద్ధ 5G స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు.

iQOO Z3 5G
iQOO Z3 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,500 కూపన్ డిస్కౌంట్‌తో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10% తగ్గింపు మరియు ఇతర ఆఫర్‌లను ఉపయోగించి దీనిని సుమారు రూ.17,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI మరియు ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేసెమెంట్ తో కూడా వస్తుంది.
iQOO 7 లెజెండ్ 5G
ఐక్యూ 7 లెజెండ్ 5G అమెజాన్ సేల్ లో ఆకర్షణీయమైన EMI ఆఫర్‌లతో పాటు ఇతర iQOO స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌లతో పాటుగా కూపన్‌లను ఉపయోగించి రూ.2,000 వరకు సేవింగ్స్ చేయవచ్చు.
Mi 10i 5G స్మార్ట్ ఫోన్ ను 2 నెలల నో-కాస్ట్ ఇఎంఐతో జాబితా పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లల్లో భాగంగా రూ.3,000 అదనపు డిస్కౌంట్ మరియు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌లు సంస్థ నుండి ఎంచుకున్న మోడళ్లకు వర్తిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ 2 5G
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో వన్‌ప్లస్ నార్డ్ 2 5G ఎక్స్ఛేంజ్‌లో రూ.1,000 అదనపు డిస్కౌంట్‌తో వినియోగదారులు దీన్ని సుమారు రూ.30,000 డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 9R 5G ను తమ చేతులలో పొందాలనుకుంటున్న కొనుగోలుదారులకు రూ.4,000 కూపన్ డిస్కౌంట్ మరియు ఎక్స్ఛేంజ్లో రూ.5,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. మీరు ఎంచుకున్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో వర్తించే 9 నెలల నో-కాస్ట్ EMI ను కూడా పొందవచ్చు. అలాగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో లభించే బెస్ట్ ఆఫర్లలో వన్‌ప్లస్ నార్డ్ CE 5G కూడా ఉంది.
రెడ్‌మి నోట్ 10T 5G అనేది ఇటీవల రెడ్‌మి యొక్క ప్రసిద్ధ నోట్ సిరీస్ నుండి లాంచ్ అయింది. ఇది రెడ్‌మి బ్రాండ్ నుండి మరియు భారతదేశంలో మొదటి 5 జి రెడీ ఫోన్. ఇది అమెజాన్ ప్రైమ్ డే 2021 సమయంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 తగ్గింపు ధరతో పాటుగా బ్యాంక్ యొక్క డిస్కౌంట్ ఆఫర్లతో పొందవచ్చు.


Click it and Unblock the Notifications








