Home
News

Amazon ప్రైమ్ డే సేల్స్ డేట్ వచ్చేసింది!! డిస్కౌంట్ల మీద ఓ లుక్ వేయండి...

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ యొక్క ఆన్‌లైన్‌ అమ్మకాలు తరచూ నిర్వహిస్తున్నప్పటికీ "అమెజాన్ ప్రైమ్ డే సేల్" కు ఎక్కువ ఆదరణను కలిగి ఉన్నాయి. కరోనా కారణంగా ఈ సంవత్సరం కూడా అమెజాన్ తన ప్రైమ్ డే అమ్మకాలను ఆలస్యంగా నిర్వహిస్తున్నది. అమెజాన్ ఎట్టకేలకు తన ప్రైమ్ డే అమ్మకం గురించి ఇప్పుడు అధికారిక ప్రకటనను చేసింది. మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలనుకుంటే కనుక ఈ అమ్మకం ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ ప్రైమ్ ఇండియా 5వ వార్షికోత్సవంలో భాగంగా అమెజాన్ జూలై 26 నుండి జూలై 27 వరకు భారతదేశంలో తన ప్రైమ్ డే సేల్ లను నిర్వహించనున్నది. ఈ అమ్మకంలో అనేక ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో అమెజాన్ డివైస్లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ అప్లియన్స్ మరియు వంటగది సామానులు, ఫర్నిచర్, రోజువారీ అవసరమైన వస్తువులతో పాటు వినోదకరమైన ప్రయోజనాల మీద డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ అమ్మకం జూలై 26 మరియు జూలై 27 న రెండు రోజులు మాత్రమే నిర్వహించనుంది. ఈ సమయంలో వినియోగదారులకు వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్ మరియు గొప్ప ఒప్పందాలు లభిస్తాయి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్

అమెజాన్ యొక్క రెండు రోజుల ప్రైమ్ డే సేల్ జూలై 26 న ఉదయం 12 గంటల (అర్ధరాత్రి) IST నుండి ప్రారంభమవుతుంది. అలాగే జూలై 27 తో ముగుస్తుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్ కారణంగా అధికంగా నష్టపోయిన తయారీదారులు, చిల్లర వ్యాపారులు, చిన్న వ్యాపారాలు, నష్టపోయిన స్థానిక దుకాణాలను శక్తివంతం చేసే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ అమ్మకాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. ఈ అమ్మకంలో వినియోగదారులు అనేక వివిధ రకాల వర్గాలలో గొప్ప తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, ఒప్పందాలను పొందే అవకాశాన్ని పొందుతారు. అమెజాన్‌లో ఇప్పుడు 300 కి పైగా కొత్త ఉత్పత్తులు కూడా విడుదల కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు రాయితీ పొందుతారు. అదనంగా ఇ-టైలర్ నో-కాస్ట్ EMI ఆప్షన్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తుంది. ముఖ్యంగా HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేసిన వారికి తమ యొక్క కొనుగోలు మీద అధిక మొత్తంలో క్యాష్ బ్యాక్ లు లభిస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్

అమెజాన్ ప్రైమ్ డే అమ్మకంలో షియోమి సంస్థ యొక్క రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఎప్పుడు లేని విధంగా ఊహించని రీతిలో డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఇవే కాకుండా ఇటీవల ఇండియాలో విడుదలైన రియల్ మి స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర బ్రాండ్ ల ఫోన్ ల మీద కూడా ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

పవర్ బ్యాంకుల మీద 40% తగ్గింపు

అమెజాన్ యొక్క ప్రైమ్ డే అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీదనే కాకుండా షియోమి సంస్థ యొక్క Mi పవర్ బ్యాంకుల మీద కూడా 40% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. 20000mAh సామర్ధ్యం గల Mi పవర్ బ్యాంక్ 3i ను ప్రస్తుత అమ్మకంలో కేవలం రూ.1499 తగ్గింపు ధర వద్దనే పొందవచ్చు. అలాగే ఈ అమ్మకంలో వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8T వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ధరల వద్ద అందిస్తున్నది.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale 2021 Date Announced in India: Check Discounts, Electronic Deals and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X