అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో భారీ డిస్కౌంట్ ఆఫర్..

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్స్ మొదలయ్యాయి. ఈ ప్లాట్‌ఫాంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అధిక మొత్తంలో డిస్కౌంట్లు మరియు ఆఫర్‌లను తీసుకువచ్చింది. ఈ అమ్మకం సమయంలో ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ల మీద సుమారు రూ.9,000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఈ అమ్మకంలో వన్‌ప్లస్, ఆపిల్, వివో, ఐక్యూ, షియోమి, శామ్‌సంగ్, ఒప్పో మరియు మరిన్ని బ్రాండ్ల యొక్క ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 లో లభించే అద్భుతమైన ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్ ప్రైమ్ డే సేల్: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో భారీ డిస్కౌంట్ ఆఫర్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్‌లపై అధిక మొత్తంలో భారీగా తగ్గింపును అందిస్తోంది. వన్‌ప్లస్ 9 ప్రో 5G, వన్‌ప్లస్ 9 5G, వన్‌ప్లస్ 8T 5G వంటి స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద సుమారు రూ.6000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అదనంగా బ్యాంక్ యొక్క తగ్గింపు ఆఫర్ మరియు ఎక్సచేంజ్ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు హాసెల్‌బ్లాడ్ కెమెరాలతో వన్‌ప్లస్ 9 ప్రో 5G ను కేవలం రూ.69,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా బ్యాంకుల తగ్గింపు ఆఫర్లు కూడా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్ లో డిస్కౌంట్ ధర వద్ద లభిస్తున్న ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ లలో వివో మరియు దాని సబ్ బ్రాండ్ ఐక్యూ సంస్థల ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై అధిక మొత్తంలో డిస్కౌంట్‌ ధరలు లభిస్తున్నాయి. వీటిలో వివో X60, వివో X60 ప్రో +, ఐక్యూ 7 5G, ఐక్యూఓ 7 లెజెండ్ 5G వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో లభిస్తాయి. ఉదాహరణకు iQOO 7 5G ను అన్ని తగ్గింపులను పొందిన తరువాత కేవలం రూ. 31,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ డే 2021 అమ్మకంలో ఆపిల్ ఐఫోన్ సిరీస్‌లపై గల డిస్కౌంట్‌ను మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్, మరియు ఐఫోన్ XR వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ అధికంగా ఉంది. వాస్తవానికి మీరు ఐఫోన్ 12 ప్రో మాక్స్ ను ఇప్పుడు కేవలం రూ.1,15,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అదనంగా HDFC బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి.

అదనంగా శామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5G, మరియు గెలాక్సీ S21 అల్ట్రా 5Gలకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 వద్ద సుమారు రూ.5000 వరకు ధర తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటుగా ఒప్పో రెనో 5 ప్రో 5G, రెడ్‌మి నోట్ 10T 5G మరియు Mi 11X ప్రో 5G ని కూడా డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 ప్రస్తుతం అందుబాటులో ఉంది కావున మరిన్ని ఉత్తేజకరమైన ఆఫర్లను వెబ్ సైట్ లో తనిఖీ చేయవచ్చు

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale 2021: Huge Discount Offer On Premium Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X