Home
News

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2024 తేదీలు వెల్లడి.. డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్ల పూర్తి వివరాలు..!!

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024 (Amazon Prime Day sale 2024) వివరాలను సంస్థ వెల్లడించింది. ఈ సేల్‌ జూన్‌ 20న ప్రారంభం కానుంది. జులై 21 అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా అనేక ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌ లను కలిగి ఉంటారని తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ లు, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ లు మరియు గృహోపకరణాలపై తగ్గింపు ధరలను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్‌ లను కూడా పొందవచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024 లో భాగంగా ICICI, SBI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఏయే వస్తువులపై ఎంత శాతం తగ్గింపును పొందవచ్చనే వివరాలను వెల్లడించలేదు. అమెజాన్‌ పే ICICI బ్యాంకు కార్డులపై 5 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు.

Amazon Prime Day sale 2024

అమెజాన్‌ ప్రైమ్ డే సేల్‌ 2024 లో భాగంగా Echo స్మార్ట్‌ స్పీకర్లు మరియు ఫైర్ టీవీ స్టిక్స్‌ పైన గరిష్ఠంగా 55 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ బ్యాంకు ఆఫర్లతోపాటు రివార్డు పాయింట్లను పొందవచ్చని తెలుస్తోంది. ఆర్డర్‌ చేసిన రోజు లేదా తర్వాత రోజు డెలివరీ చేయనున్నారు.

ఈ సేల్ సమయంలో అనేక కొత్త ఉత్పత్తులు విడుదల కానున్నాయి. శాంసంగ్‌, వన్‌ ప్లస్‌, హానర్‌, ఐకూ, లావా, మోటోరోలా నుంతి ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. దీంతోపాటు ఇంటెల్‌, బజాజ్‌, సోనీ, బోట్‌, HP, టైటాన్‌, ఏసర్‌, లెనోవో, అమెరికన్ టూరిస్టర్‌ వంటి సంస్థలు కూడా తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. మొత్తంగా సుమారు 450 సంస్థల నుంచి కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి.

Amazon Prime Day sale 2024

అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు మాత్రమే ఈ సేల్‌ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీరు ప్రైమ్‌ మెంబర్ కాకుంటే 30 రోజుల పాటు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ను (ట్రయల్‌) ను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఉంది. కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్ మెంబర్‌ షిప్‌ నెలవారీ ధర రూ.299 గా ఉంది.

మూడు నెలల అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కోసం రూ.599 ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సంవత్సరం ప్లాన్ కోసం రూ.1499 చెల్లించాలి. అదే అమెజాన్ ప్రైమ్‌ షాపింగ్ ఎడిషన్‌ 12 నెలల ప్లాన్ ధర రూ.399 గా ఉంది. ప్రైమ్ మెంబర్లు వేగవంతమైన డెలివరీని పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Prime Day sale 2024 dates announced here are the best deals and bank discounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X