Home
News

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024 ఆఫర్లు, డిస్కౌంట్‌ల వివరాలు వెల్లడి.. గరిష్ఠంగా 75 శాతం డిస్కౌంట్‌..!

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024 (Amazon Prime Day Sale 2024) జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ సేల్‌లో కేవలం ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన వారు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంది. తాజాగా ప్రైమ్‌ డే సేల్‌ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లు సహా ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపును పొందవచ్చు.

కొత్త స్మార్ట్‌ఫోన్‌లు శాంసంగ్‌ గెలాక్సీ M35, మోటోరోలా Razr 50 అల్ట్రా, ఐకూ Z9 లైట్ 5G, లావా బ్లేజ్‌ X స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు రెడ్‌మి 13 5G, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 లైట్‌, రియల్‌మి GT 6T, వన్‌ప్లస్‌ 12R కొత్త వేరియంట్‌తోపాటు శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, ఐఫోన్‌ 13 హ్యాండ్‌సెట్‌లను బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

amazon Prime day sale 2024 details

ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌, వన్‌ప్లస్‌, షియోమీ, ఐకూ, రియల్‌మి, పోకో, హానర్‌, మోటోరోలా, లావా, నోకియా, వివో సహా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా 24 నెలల నో కాస్ట్ EMI సహా ఎక్స్చేంజీ ఆఫర్లను పొందవచ్చు. మరియు కూపన్ల ద్వారా తగ్గింపును పొందవచ్చు.

అమెజాన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ట్యాబ్లెట్‌లను 60 శాతం తగ్గింపును పొందవచ్చు. హెడ్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 75 శాతం, స్పీకర్లను 60 శాతం డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. డెస్క్‌టాప్‌, కంప్యూటర్‌ విడిభాగాలను గరిష్ఠంగా 75 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది.

amazon Prime day sale 2024 details

సోనీ, శాంసంగ్‌, TCL, LG, ఏసర్‌, రెడ్‌మి, హైసెన్స్‌, Vu వంటి బ్రాండ్ల టీవీలపై గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది. వీటితోపాటు బ్యాంకు ఆఫర్లు, కూపన్‌ క్యాష్‌బ్యాక్‌, ఎక్స్చేంజీ బోనస్, నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం రూ.6,999 కే బడ్జెట్‌ రేంజ్‌లో టీవీలను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఎయిర్‌ కండిషనర్స్‌, రిఫ్రిజిరేటర్లపైన 55 శాతం, వాషింగ్ మెషిన్‌లపైన 60 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ICICI, SBI బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఏయే వస్తువులపై ఎంత శాతం తగ్గింపును పొందవచ్చనే వివరాలను వెల్లడించలేదు. అమెజాన్‌ పే ICICI బ్యాంకు కార్డులపై 5 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు.

amazon Prime day sale 2024 details

అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లు మాత్రమే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. మీరు ప్రైమ్‌ మెంబర్ కాకుంటే 30 రోజుల పాటు ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను (ట్రయల్‌) ను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఉంది. అదే కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్ మెంబర్‌ షిప్‌ నెలవారీ ధర రూ.299 గా ఉంది.

మూడు నెలల అమెజాన్ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కోసం రూ.599, అదే సంవత్సరం ప్లాన్ కోసం రూ.1499 చెల్లించాలి. అదే అమెజాన్ ప్రైమ్‌ షాపింగ్ ఎడిషన్‌ 12 నెలల ప్లాన్ ధర రూ.399 గా ఉంది. ప్రైమ్ మెంబర్లు వేగవంతమైన డెలివరీని పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon Prime day sale 2024 offers and bank discounts revealed ahead of sale on july 20 and 21 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X