Amazon ప్రైమ్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు..!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం అయింది. రేపటి వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ఇయర్‌ఫోన్లు, కంప్యూటర్ విడిభాగాలు, ఇతర గృహోపకరణాలు సహా చాలా ఉత్పత్తులపై అత్యుత్తమ ఆఫర్లు అందిస్తోంది. ప్రత్యేకంగా కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై మంచి ఆఫర్లు కలిగి ఉన్నాయి.
అమెజాన్‌లో ఎంపిక చేసిన వస్తువులను ICICI మరియు SBI బ్యాంక్ క్రెడిట్, డిబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులు 10 శాతం డిస్కౌంట్ పొందుతారు(బోసన్‌తో కలిపి). అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన వస్తువులకే ఉందని కస్టమర్లు గమనించాలి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, మోటోరొలా, ఐకూ, రియల్‌మీ, వన్‌ప్లస్, సహా ఇతర ఫోన్లపై ఈ ప్రైమ్‌డే సేల్‌లో ఉత్తమ ఆఫర్లు ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 14 128GB వేరియంట్ విడుదల చేసిన సమయంలో రూ.79,900 ఉండేది. అయితే ఈ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ లభించింది. ఐఫోన్ 14ను ధర రూ.65,999కే కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన ప్రైమ్ మెంబర్లు అదనంగా మరో 750 రూపాయల తగ్గింపును పొందవచ్చు.
ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్ A15 బయోనిక్ SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, మిడ్‌నైట్, పర్పల్, స్టార్‌లైట్, యెల్లో, రెడ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G ఫోన్ గత సంవత్సరం రూ.19,999 (6GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ)కు విడుదల అయింది. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ.17499కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అదనంగా మరో 500 రూపాయల వోచర్ లభిస్తుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే మరింత తగ్గువ ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ( 1080*2412 పిక్సల్) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్, 64MP కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా వ్యవస్థ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ S20 FE 5G స్మార్ట్‌ఫోన్ 2021 మార్చిలో విడుదల అయింది. 8GB ర్యామ్+ 128G అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రారంభ ధర రూ.55,999గా ఉండేది. అయితే ఈ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా భారీగా ధర తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు.
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో 2000 రూపాయల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 865 SoC ప్రాసెసర్ మరియు 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
షియోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఏప్రిల్‌లో రూ.62,999 ధరకు విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా రూ.41,999కే కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,250 అదనపు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.39,749కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 SoC ప్రాసెసర్, 6.72 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
iQoo నియో 7 5G స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.29,999కు విడుదల అయింది. ఈ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ.27,999కే అందుబాటులోకి వచ్చింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1200 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 6.78 అంగుళాల పుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్ల్ 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగిఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 5G SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
వన్‌ప్లస్ 10R 5G స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ఏప్రిల్‌లో 8GB ర్యామ్+128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ రూ.38,999కు విడుదల అయింది. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.36,999కు అందుబాటులోకి వచ్చింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,250 అదనపు తగ్గింపు పొందుతారు. ఈ ఫోన్ రూ.34,749కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే్ను కలిగి ఉంటుంది.
రెడ్‌మీ నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా బ్యాంక్ ఆఫర్లతో కేవలం రూ.14999కే కొనుగోలు చేయవచ్చు. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. MIUI 13 ఆధారంగా పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 48MP+8MP+2MP వెనుక కెమెరా మరియు 13MP ముందు కెమెరాను కలిగి ఉంటుంది.
iQoo Z7s స్మార్ట్‌ఫోన్ ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.17499కు అందుబాటులో ఉంది. ఫోన్ 6.38 అంగుళాల పుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, ఫన్‌టచ్ OS 13 ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 4500mAh బ్యాటరీ, 44W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. 64MP OIS+2MP వెనుక కెమెరాలు, 16MP ముందు కెమెరాను కలిగి ఉంటుంది.
లావా అగ్ని 2 5G స్మార్ట్‌ఫోన్ బ్యాంకు ఆఫర్లతో కలిగి రూ.20,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.78 అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 OSను కలిగి ఉంటుంది. 4700mAh బ్యాటరీ, 66W ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. 50MP+8MP+2MP వెనుక కెమెరాలు, 16MP ముందు కెమెరాను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








