అమెజాన్‌లో స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.80,000 భారీ తగ్గింపు ఆఫర్స్

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న రెండు రోజుల అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను ఇవ్వడంతో అనేక గాడ్జెట్లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు అదనంగా 10% తగ్గింపును కూడా పొందవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ యొక్క సేల్ ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నది.

 
అమెజాన్‌లో స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.80,000 భారీ తగ్గింపు ఆఫర్స్

అందుబాటు ధరలో 32-ఇంచ్ మరియు 39-ఇంచ్, 40-ఇంచ్, 42-ఇంచ్ మరియు 45-ఇంచ్ 55-ఇంచ్ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనీ చూస్తున్న వారికి అమెజాన్ గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. ముఖ్యంగా LG సంస్థ యొక్క 80 సెం.మీ (32 అంగుళాలు) LG HD రెడీ LED స్మార్ట్ టీవీ 32LM560BPTC తో IPS డిస్ప్లే & వెబ్ఓఎస్ (2019 మోడల్) మోడల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రస్తుత అమ్మకంలో రూ.1000 తగ్గింపు లభిస్తుంది. సాధారణంగా రూ.18,990 ధర వద్ద లభించే ఈ టీవీ ప్రస్తుత అమ్మకంలో రూ.17,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటుగా బ్యాంక్ యొక్క డిస్కౌంట్ ఆఫర్లు అదనంగా ఉన్నాయి. దీనితో పాటుగా LG సంస్థ యొక్క మరొక స్మార్ట్ టీవీ LG 139.7 cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ OLED TV 55A1PTZ (డార్క్ మెటియో టైటాన్) (2021 మోడల్) ను కూడా రూ.80,000 తగ్గింపుతో రూ.1,29,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మరిన్నివివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ యొక్క ప్రస్తుత సేల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

సోనీ సంస్థ ఇండియాలో ఇటీవల లాంచ్ చేసిన సోనీ బ్రావియా 164 సెం.మీ (65 అంగుళాలు) 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ LED గూగుల్ టీవీ KD-65X80AJ (బ్లాక్) (2021 మోడల్) అలెక్సా యొక్క సపోర్ట్ తో లభిస్తుంది. రూ.1,79,990 ధర వద్ద లాంచ్ అయిన ఈ టీవీ ప్రస్తుత అమ్మకంలో రూ.70,000 తగ్గింపుతో రూ.1,09,990 ధర వద్ద లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ అమ్మకంలో ఈ ఆఫర్స్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అని గమనించండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale Live: Huge Discount Offers Up to Rs.80,000 on Purchase of Smart TVs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X