మరో రెండు రోజుల్లో, అమెజాన్ సేల్! ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, లిస్ట్!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 15న మొదలు కాబోతోంది.ఇంకో, రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ సేల్ కేవలం 48 గంటలు మాత్రమే లైవ్‌లో ఉంటుంది, అంటే ఇది జూలై 15 నుండి జూలై 16 చివరి వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో, మోటోరోలా రేజర్ 40 అల్ట్రా, ఐఫోన్ 14, ఐక్యూ నియో 7 ప్రో మరియు మరిన్ని ప్రముఖ ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తామని అమెజాన్ వాగ్దానం చేస్తోంది. ఈ సేల్ ఈవెంట్‌కు ముందు, కంపెనీ కొన్ని 5G ఫోన్‌ల ధరలను టీజ్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15 నుండి ప్రారంభమవుతుంది: ఈ డీల్స్ వెల్లడి
ఇటీవలే భారతదేశంలో ప్రారంభించబడిన మోటోరోలా రేజర్ 40 అల్ట్రా లాంచ్ ధర రూ. 82,999 తో లభిస్తుందని అమెజాన్ ప్రైమ్ డే సేల్ యొక్క టీజర్ లో పేర్కొంది. ఈ ఫోన్ భారతదేశంలో రూ. 89,999 కి లాంచ్ చేయబడింది. అంటే వినియోగదారులకు రూ.7,000 తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపు ధర 256GB స్టోరేజ్ మోడల్ పై ఉంది.

అదేవిధంగా ఐఫోన్ 14 కూడా భారీ తగ్గింపు ఆఫర్ తో లభిస్తున్నది, ఈ ఫోన్ ఇప్పుడు రూ.66,499 కి అందుబాటులో ఉంది. అదే ఐఫోన్ ఇప్పటికీ Apple యొక్క ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 79,900కి అమ్ముడవుతోంది. అంటే త్వరలో ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో iPhone 14 పై రూ. 13,401 తగ్గింపు ఆఫర్ ను మీరు పొందవచ్చు. ఈ ఆఫర్ ధర 128GB స్టోరేజ్ మోడల్ కోసం వర్తిస్తుంది.
అలాగే, ఇటీవల లాంచ్ చేసిన రియల్ మీ నార్జో 60 ప్రో 5G అసలు ధర రూ. 23,999 నుండి తగ్గించి, రూ. 22,499 ధరతో విక్రయించబడుతుంది. వన్ ప్లస్ నోర్డ్ 3 రూ. 32,999 కి మీకు లభిస్తుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ ఇటీవల భారతదేశంలో రూ. 33,999కి అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్కౌంట్ నిర్దిష్ట బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుంది మరియు దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
అదేవిధంగా, ఐక్యూ నియో 7 ప్రో ధర రూ. 31,999 గా ఉంది, మరియు ఈ ఆఫర్, బ్యాంక్ కార్డ్ ఆధారంగా ఉంటుంది. ఇది భారతదేశంలో రూ. 34,999 ధర ట్యాగ్‌తో లాంచ్ చేయబడింది. ఇందులో ప్రీమియం స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంది, ఇది వేగవంతమైనది మరియు వినియోగదారులకు సరసమైన ధరలో సున్నితమైన పనితీరును అందించగలదు. మిగిలిన ఇతర ప్రైమ్ డే సేల్ డీల్స్‌ను అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను మీరు ఉచితంగా పొందడం ఎలా?
అమెజాన్ ప్రస్తుతం కొత్త వినియోగదారులకు 1 నెల ఉచిత ట్రయల్‌ని అందిస్తోంది. కాబట్టి, మీరు ఈ ఆఫర్‌ను పొందకుంటే, మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి అమెజాన్ ప్రైమ్ వీడియోని అధికారికంగా ఉచితంగా ఉపయోగించండి. ఈ ఆఫర్ అమెజాన్‌లో ఇంత వరకూ ఖాతాను సృష్టించని వారికి మాత్రమే.


Click it and Unblock the Notifications








