COVID-19 సెకండ్ వేవ్ దెబ్బకు 'ప్రైమ్ డే సేల్' ను నిలిపివేసిన అమెజాన్

|

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన యొక్క వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త అమ్మకాలతో ముందుకు వస్తున్నది. కానీ ప్రతి సంవత్సరం జరిపే 'అమెజాన్ ప్రైమ్ డే సేల్' మాత్రం వీటికి కొద్దిగా బిన్నంగా ఉంటుంది. గత సంవత్సరం కరోనా కారణంగా ఈ ప్రత్యేక సేల్స్ ను నిలిపివేసింది. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారతదేశంలో తన వార్షిక ప్రైమ్ డే అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిదుల సమాచారం లీక్ అయినట్లు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్

అమెజాన్ సంస్థ భారతదేశంలో 'ప్రైమ్ డే సేల్' ను ఎందుకు పాజ్ చేసింది? ఇప్పుడు ఈ విషయం చర్చనీయం అయింది. ఇండియాలో అమెజాన్ యొక్క వార్షిక ప్రైమ్ డే అమ్మకాన్ని నిలిపివేయడానికి గల కారణం గురించి ఖచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో COVID-19 సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండడం వలన దీని తాకిడికి వేలాది మంది ఇప్పటికే చనిపోవడంమే అతి పెద్ద కారణం అని తెలుస్తోంది.

కరోనా తీవ్రత

కరోనా తీవ్రత అధికంగా ఉండడం వలన ప్రస్తుతానికి ప్రైమ్ సేల్ జరపడం లేదు. అయితే COVID పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఈ ప్రైమ్ డే అమ్మకం జరుగుతుందో లేదో అన్నదాని మీద ఇ-కామర్స్ దిగ్గజం ఇంకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలను కొనసాగిస్తూ ప్రస్తుతం అమెజాన్ కొన్ని రాష్ట్రాల్లో అవసరమైన ఉత్పత్తులతో తమ సేవలను అందిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం
 

అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం ప్రతి సంవత్సరం మధ్యలో ఫ్లిప్‌కార్ట్ యొక్క గ్రేట్ ఇండియన్ అమ్మకంకు పోటీగా జరుగుతుంది. ఈ ప్రైమ్ డే అమ్మకం సమయంలో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మీద అద్భుతమైన తగ్గింపులను అందించడంతో పాటుగా వాటి కొనుగోలు మీద ఊహించని రీతిలో గొప్ప ఒప్పందాలను అందిస్తుంది. ఈ అమ్మకం సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై నెలలో జరుగుతుంది.

COVID-19

భారతదేశం COVID-19 యొక్క సెకండ్ వేవ్ తీవ్రతతో పోరాటం చేస్తూ కష్టపడుతుంటే అమెజాన్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు విరాళాలను అందిస్తున్నాయి. వీటితో పాటుగా ఆక్సిజన్ సాంద్రతలు మరియు మరెన్నో వైద్య పరికరాల సరఫరాల సహాయంతో ముందుకు వచ్చాయి. ప్రతి రోజు గడిచేకొద్దీ భారతదేశంలో COVID-19 కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజా అప్ డేట్ ప్రకారం భారతదేశంలో రోజువారీ COVID కేసులు 4lakh మార్కును దాటాయి.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale Stoped in India Due to COVID-19 Cases

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X