అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఆపిల్ వాచ్ SE పై రూ.5000 అద్భుత తగ్గింపు!

|

ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్ తన యొక్క ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ ప్రైమ్ డేస్ ప్రత్యేక అమ్మకంలో అందించే అద్భుతమైన ఆఫర్లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షించాయి. అమెజాన్ యొక్క ప్రైమ్ డే సేల్స్ రేపటితో ముగియనున్నది. అయితే ఈ ప్రత్యేకమైన సేల్స్ లోని అన్ని రకాల ఆఫర్లు ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్ విభాగంలో అధికంగా ఆకట్టుకున్న ఆపిల్ సంస్థ యొక్క ఆపిల్ వాచ్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ ఇప్పుడు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది.

 
అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఆపిల్ వాచ్ SE పై రూ.5000 అద్భుత తగ్గింపు!

అమెజాన్ యొక్క ప్రైమ్ డే సేల్ లో ఇప్పుడు స్మార్ట్ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. ఆపిల్ వాచ్ SE వెర్షన్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ అమెజాన్ సేల్ ప్రత్యేక డిస్కౌంట్ ను అందిస్తున్నది. ఈ అమ్మకంలో లభించే రాయితీలను పరిశీలిద్దాం.

ఆపిల్ వాచ్ సిరీస్ 6 తో పాటు గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ వాచ్ SEను విడుదల చేసింది. ఇది సిల్వర్, స్పేస్, గ్రే మరియు గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదనంగా ఇది 394x324 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.54-అంగుళాల LTPO OLED డిస్ప్లేని కలిగి ఉంది. గీతలు నుండి రక్షించడానికి ఆపిల్ పైన అయాన్-ఎక్స్ రీన్ఫోర్స్డ్ గాజును ఉపయోగించింది. అదనపు భద్రతా ఫీచర్ లలో 50 మీటర్ల వరకు నీటి నిరోధకత, అత్యవసర SOS మరియు అత్యవసర అంతర్జాతీయ కాల్‌లు వంటివి ఉన్నాయి.

ఈ వాచ్ ఇప్పుడు అమెజాన్ యొక్క సేల్‌లో రూ.5000 తగ్గింపుతో లభిస్తున్నది. సాధారణంగా రూ.29,900 ధర వద్ద లభించే ఈ వాచ్ ప్రస్తుత అమ్మకంలో రూ.24,900 ధర వద్ద లభిస్తున్నది. ఈ వాచ్‌ఓఎస్ 7 ను రన్ అవుతుంది. అలాగే ఇది లి-అయాన్ బ్యాటరీ ద్వారా నియంత్రించబడుతుంది మరియు 18 గంటల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ జిపిఎస్ మరియు జిపిఎస్ తో పాటు సెల్యులార్ మోడళ్లలో లభిస్తుంది. చివరగా ఆపిల్ వాచ్ SE లో వైఫై మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale: Up to Rs.5000 Discount Offers on Apple Watch SE

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X