అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ డేట్ & డీల్స్ వివరాల మీద ఓ లుక్ వేయండి...

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా ప్రైమ్ డే సేల్స్ ని నిర్వహించనున్నది. రెండు రోజులపాటు జరిగే ప్రైమ్-ఎక్స్‌క్లూజివ్ తో షాపింగ్ సందడి చేయడానికి భారతదేశానికి రానున్నది. అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్స్ ఇండియాలో ఈ నెల జులై 23 మరియు 24 రెండు రోజులు నిర్వహించనున్నాయి. ఈ రెండు రోజుల అమ్మకంలో ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ పరికరాలు, టీవీలు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన తగ్గింపులను ఇస్తుంది. ఈ సంవత్సరం భారీ ప్రైమ్ డే అమ్మకం ద్వారా మొబైల్ ఫోన్లకు మంచి ఆఫర్లను ప్రకటించింది.

 

ప్రైమ్ డే సేల్

అమెజాన్ లో మొదలుకానున్న ప్రైమ్ డే సేల్ లో వినియోగదారులకు అందుబాటులో అద్భుతమైన ఆఫర్లను తీసుకొనిరనున్నది. ఇప్పటికి ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వారు ఆన్ లైన్ లో ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు మరియు బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారి కోసం అమెజాన్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. బడ్జెట్ ధరలో రియల్‌మి, రెడ్‌మి మరియు సామ్ సంగ్ బ్రాండ్ల యొక్క స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అమెజాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రైమ్ సేల్ ఒక మంచి ప్లేస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ప్రైమ్ డే సేల్స్ లో ప్రైమ్ సభ్యులకు

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో ప్రైమ్ సభ్యులకు అద్భుతమైన ఆఫర్లను అందివ్వనున్నది. జూలై 23 & 24 మధ్య జరిగే ఈ సేల్ లో అనేక ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపు లభించింది. కాబట్టి మీరు స్మార్ట్‌ఫోన్, హెడ్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, వాచ్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తిని కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు సరైన సమయం అవుతుంది. ఈ సేల్స్ సమయంలో ఐసీఐసీఐ మరియు SBI బ్యాంక్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను కలిగిన వినియోగదారులకు అదనంగా 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయగల అన్ని ఉత్పత్తులను ఇక్కడ క్రింద జాబితా చేస్తున్నాము.

వన్ ప్లస్ , శాంసంగ్ గెలాక్సీ లపైనా భారీ డిస్కౌంట్స్
 

వన్ ప్లస్ , శాంసంగ్ గెలాక్సీ లపైనా భారీ డిస్కౌంట్స్

వన్‌ప్లస్ 9 5 జి మొబైల్ ను రూ .45,999 కే అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం వన్‌ప్లస్ 9 5జిపై ప్రత్యక్ష తగ్గింపును అందించడం లేదు, కానీ మీరు పేజీలోని సాధారణ చెక్‌బాక్స్ ఆధారిత కూపన్‌పై ఈ ఆఫర్ ను పొందవచ్చు . మీరు మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ను కూడా మార్పిడి చేసుకోవచ్చు తద్వారా రూ. 13,400 ఆదా అవుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 రూ. 54,999 కే అందిస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 (8 జీబీ, 256 జీబీ) ప్రస్తుతం రూ. 54,999 మాత్రమే . దీని ఎంఆర్‌పి రూ .86,000.

రూ.10,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

రూ.10,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు

రియల్‌మి, రెడ్మి, సామ్ సంగ్, టెక్నో, వన్ ప్లస్, లావా వంటి ఇతర బ్రాండ్లు ఇండియాలో ఇటీవల లాంచ్ చేసిన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క అన్ని వేరియంట్‌లు ప్రైమ్ డే సేల్ లో గొప్ప తగ్గింపులతో లభిస్తాయి. రెడ్‌మి 9A, రియల్‌మి నార్జ్ 30A లతో పాటుగా సామ్ సంగ్ గెలాక్సీ యొక్క M02, M02s యొక్క అన్ని వేరియంట్‌లు ముఖ్యంగా రూ.10,000 లోపు లభించే అన్ని ఫోన్ లను డిస్కౌంట్ ధరలతో పొందవచ్చు. అదనంగా బ్యాంక్ యొక్క ఆఫర్లు కూడా ఉన్నాయి.

హెడ్‌ఫోన్‌ల పై  70% వరకు ఆఫర్

హెడ్‌ఫోన్‌ల పై 70% వరకు ఆఫర్

హెడ్‌ఫోన్‌లను కొనాలనుకుంటున్నారా? వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు అయినా లేదా సాధారణ వైర్డు ఇయర్‌ఫోన్‌లు అయినా సరే వీటిపైన ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ ఇండియా లో హెడ్‌ఫోన్‌లలో 70% వరకు ఆఫర్లను ప్రకటించింది.

స్మార్ట్‌వాచ్‌ల పై  60% వరకు ఆఫర్

స్మార్ట్‌వాచ్‌ల పై 60% వరకు ఆఫర్

లేటెస్ట్ ట్రేండింగ్ స్మార్ట్‌వాచ్‌లు పై ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ లో 60% వరకు వివిధ రకాల ఆఫర్‌లను ప్రకటించారు. మీ రోజూ కార్యకలాపాలతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు సూచించే స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించాలనుకుంటే కనుక ప్రైమ్ డే అమ్మకం ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే.

ప్రింటర్ల పై  50% వరకు ఆఫర్

ప్రింటర్ల పై 50% వరకు ఆఫర్

ప్రస్తుత సమయంలో ఆన్‌లైన్ క్లాస్ లకు డిమాండ్ పెరగడం తో మన ఇంట్లో ప్రింటర్ ల అవసరం కూడా పెరిగింది. అందుకే అమెజాన్ ప్రైమ్ డే అమ్మకాలలో ప్రింటర్లను 50% తగ్గింపుతో అందిస్తుంది. మీకు ఉత్తమ ధర వద్ద మీకు నచ్చిన ప్రింటర్ లభిస్తుంది.

హార్డ్ డ్రైవ్‌ల పై  50% వరకు ఆఫర్

హార్డ్ డ్రైవ్‌ల పై 50% వరకు ఆఫర్

రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో హార్డ్ డ్రైవ్ డిస్క్‌లలో 50% వరకు ఆఫర్ ఉంది. ప్రైమ్ డే 2022 అమ్మకం ద్వారా మీరు ప్రీమియం బ్రాండ్ల కు సంబందించిన ఆకట్టుకునే హార్డ్ డ్రైవ్ డిస్కులను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.

మానిటర్లు పైన  60% వరకు ఆఫర్

మానిటర్లు పైన 60% వరకు ఆఫర్

లాక్ డౌన్ మొదలయిన తరువాత ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అనేది ముఖ్యమైన డివైస్ గా మారింది.దీని ప్రయోజనం కోసం మీ మానిటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? జులై 23 న ప్రారంభం కానున్న అమెజాన్ ఇండియా ప్రైమ్ సేల్స్ మీ కోసం 60% వరకు తగ్గింపును అందిస్తోంది.

హోమ్ ఆడియో పరికరాలపై  60% వరకు ఆఫర్

హోమ్ ఆడియో పరికరాలపై 60% వరకు ఆఫర్

అమెజాన్‌లో ఆడియో పరికరాలపై గొప్ప ఆఫర్లను అందించనున్నది. ఈ పరికరాలను పొందడానికి ప్రైమ్ డే సేల్స్ సరైన సమయం. ఎందుకంటే వీటిపై భాగస్వామి ఆఫర్‌లతో పాటు 60% వరకు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sales 2022 in India: Dates, Discount Offers, Bank Deals and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X