రెండు గంటల్లోనే డెలివరీ, అమెజాన్ స్టన్నింగ్ ఆఫర్లపై ఓలుక్కేయండి !

|

ఈ కామర్స్‌లో దూసుకుపోతున్న దిగ్గజం అమెజాన్ సరికొత్తగా ముందుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ను సవాల్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ కామర్స్ దిగ్గజం ఈ నెల 16-17 తేదీల్లో రెండు రోజుల పాటు అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన వస్తువులను కేవలం రెండు గంటల్లోనే డెలివరీ చేయనుంది.వేగంగా డెలివరీ చేయడమే కాదు, కొన్ని వస్తువులపై డిస్కౌంట్లు కూడా ప్రకటించింది. వీటిల్లో ఫైర్‌ స్టిక్‌, ఎకో స్పీకర్లు, కిండెల్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పాటు హోమ్‌, కిచెన్‌ అప్లయన్స్‌, నిత్యావసర సరకులు ఉన్నాయి.ఈ సేల్ లో వన్‌ప్లస్‌6, మోటో జీ5, రియల్‌ మి వంటి ఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సేల్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

 

యూట్యూబ్‌కు దిమ్మతిరిగింది, వీడియో తొలగించనందుకు రూ.95 లక్షల జరిమానాయూట్యూబ్‌కు దిమ్మతిరిగింది, వీడియో తొలగించనందుకు రూ.95 లక్షల జరిమానా

36 గంటల సేల్‌

36 గంటల సేల్‌

అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌ కేవలం 36 గంటలు మాత్రమే ఉంటుంది. జులై 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి జులై 17 అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.

200 కొత్త వస్తువల ఆవిష్కరణలు

200 కొత్త వస్తువల ఆవిష్కరణలు

ఈ సేల్‌ 200 కొత్త వస్తువల ఆవిష్కరణలు, సినిమా, సంగీతం ప్రీమియర్లు ఉంటాయని అమెజాన్‌ తెలిపింది. ఈ ఏడాది అమెజాన్‌ ఇండియా ప్రైమ్‌ సభ్యులు అంతర్జాతీయ ప్రైమ్‌డే డీల్స్‌ను కూడా పొందవచ్చని పేర్కొంది.

ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే..

ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే..

రెండు గంటల్లో డెలివరీ ఆఫర్‌ కేవలం ప్రైమ్‌ నౌ యాప్‌లో నిర్దేశిత పిన్‌ కోడ్‌లకు మాత్రమే పరిమితం అని అమెజాన్‌ పేర్కొంది.

ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు
 

ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు

హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు నగరాల్లో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్‌ డే సందర్భంగా ప్రకటించిన డిస్కౌంట్లు కూడా ప్రైమ్‌ సభ్యులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.

డిస్కౌంట్లు

డిస్కౌంట్లు

ప్రైమ్‌ సభ్యులు ప్రైమ్‌నౌ యాప్‌ నుంచి రూ.1500కు పైగా షాపింగ్‌ చేస్తే నిత్యావసరాలపై 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. జులై 15వరకు ఈ ఆఫర్‌ ఉంటుందని పేర్కొంది.

ప్రైమ్‌నౌ సభ్యత్వం

ప్రైమ్‌నౌ సభ్యత్వం

ఈ సమయంలో ప్రైమ్‌నౌ సభ్యత్వం తీసుకున్న వారు రూ.100పైగా చేసే కొనుగోళ్లపై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది.

అందుబాటులో 10,000 బెస్ట్‌ సెల్లింగ్‌ వస్తువులు

అందుబాటులో 10,000 బెస్ట్‌ సెల్లింగ్‌ వస్తువులు

దాదాపు 10,000 బెస్ట్‌ సెల్లింగ్‌ వస్తువులను ఈ సేల్‌లో అందుబాటులో పెట్టాము. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ కేటగిరిలో విక్రయాలు ప్రతి నెలా భారీగా పెరుగుతున్నాయి.'' అని అమెజాన్‌ ప్రైమ్‌ నౌ ఇండియా అధ్యక్షుడు సిద్ధార్థ్‌ నంబియార్‌ తెలిపారు.

Best Mobiles in India

English summary
Amazon exclusive smartphones, including OnePlus 6, MotoG and RealMe, will be sold at steep discounts during Amazon Prime Day on 16-17 July More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X