రూ.129కే అమెజాన్ ప్రైమ్, నెలంతా పండుగ చేసుకోండి!

|

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌కు సంబంధించి సరికొత్త మంత్లీ ప్లాన్‌ను అమెజాన్ ఇండియా విడుదల చేసింది. ఈ సరికొత్త నెలవారీ స్కీమ్‌లో భాగంగా నాన్-ప్రైమ్ యూజర్లు సైతం నెలకు రూ.129 చెల్లించి అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మంత్లీ సబ్‌స్ర్కిప్షన్‌ను పొందాలనుకునే యూజర్లు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయవల్సి ఉంటుంది. ఆటో-రీన్యూ పద్థతిలో ఈ మెకనిజం యాక్టివేట్ అయిపోతుంది. ఆటో-రీన్యూవల్‌కు మూడు రోజుల ముందు అమెజాన్ నుంచి యూజర్‌కు నోటిఫికేషన్ అందుతుంది.

 
రూ.129కే అమెజాన్ ప్రైమ్, నెలంతా పండుగ చేసుకోండి!

సంవత్సరమంతా కావాలంటే రూ.999..
అమెజాన్ ప్రైమ్‌కు సంబంధించి ఏడాది సబ్‌స్ర్కిప్షన్‌ను ఒకేసారి తీసుకోవాలనుకునే వారు వార్షిక చందా క్రింద రూ.999 చెల్లిస్తే సరిపోతుంది. భారత్‌లో అమెజాన్ ప్రైమ్‌కు సంబంధించిన మంత్లీ సబ్‌స్ర్కిప్షన్ ఆఫర్‌ను ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది. తొలత ఈ మంత్లీ సబ్‌స్ర్కిప్షన్‌కు సంబంధించిన వివరాలను రవి మిశ్రా అనే యూజర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటం జరిగింది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందడం ఎలా ?

2016లో ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్...
ఈ-కామర్స్ రంగంలో ప్రపంచ నెం.1 సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అమెజాన్, భారత్‌లో తన Prime సేవలను 2016లో ప్రారంభించింది. ప్రమోషనల్ ప్లాన్ క్రింద ఏడాది ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను కేవలం రూ.499కే అమెజాన్ అప్పట్లో అందించటం జరిగింది. ఆ తరువాత వార్షిక చందా ధరను రూ.499 నుంచి రూ.999కి పెంచటం జరిగింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవటం వల్ల ఉచిత వన్-డే డెలివరీ, డిస్కౌంటెడ్ సేమ్ డే డెలివరీ, నో రష్ డెలివరీ, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి బెనిఫిట్స్‌ను యూజర్ పొందే వీలుంటుంది. త్వరలోనే మరిన్ని బెనిఫిట్స్ అమెజాన్ ప్రైమ్ క్రిందకు చేర్చే అవకాశముంది.

అమెరికా కంటే భారత్‌లోనే తక్కువ..
అమెరికాతో పోల్చి చూసినట్లయితే భారత్‌లో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ ధర చాలా తక్కువుగా ఉంది. యూఎస్ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ విలువ 119 డాలర్లు (రూ.8,100)గా ఉండే భారత్ మార్కెట్లో మాత్రం 12.99 డాలర్లు (రూ.900)గా ఉంది. భారత్‌లోని అమెజాన్ ప్రైమ్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని Prime Day పేరుతో ఒక్క రోజు సేల్‌ను అమెజాన్ ఇండియా గతేదాని నిర్వహించింది. ఈ సేల్‌లో భాగంగా ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్లతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అమెజాన్ అందించింది.

Best Mobiles in India

English summary
Amazon India has silently rolled out a new monthly Amazon Prime subscription plan in the country. As per the new scheme, non-Prime subscribers will be able to avail Prime benefits at a monthly package of Rs. 129.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X