Home
News

అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. ప్రైమ్ మెంబర్లుగా ఉన్నవారికి కిండిల్ డివైస్ ద్వారా ఉచితంగా ఈ-బుక్స్ చదువుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్ మెంబర్లకు మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది. ప్రైమ్ మెంబర్లుగా ఉన్నవారికి కిండిల్ డివైస్ ద్వారా ఉచితంగా ఈ-బుక్స్ చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే ప్రైమ్ మెంబర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో, మ్యూజిక్ సేవలను పొందుతుండగా దీనికి ప్రైమ్ రీడింగ్ కూడా అదనంగా జత చేరింది. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందడం ద్వారా వినియోగదారులు ఆ సైట్‌లో ప్రైమ్ డీల్స్‌ను పొందడంతోపాటు వీడియో, మ్యూజిక్, బుక్ రీడింగ్ సేవలను కూడా పొందవచ్చు. పలువురు ప్రముఖ రచయితలకు చెందిన బుక్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ రీడింగ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. జేకే రోలింగ్ రాసిన హ్యారీ పోటర్, అమిష్ రాసిన ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలుహా, రాహుల్ బదామి రాసిన ఆపరేషన్ డీప్ స్ట్రైక్ తదితర ప్రముఖ బుక్స్‌ను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ రీడింగ్‌లో ఉచితంగా చదవవచ్చు. దీతో పాటు అమెజాన్‌లో కొన్నిఉచితంగా దొరుకుతాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

Download and Stream Free Music

Download and Stream Free Music

ఇందులో దాదాపు 10 వేలకు పైగా ఎంపీ3లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా ఎటువంటి లిమిట్ లేకుండా మీకు అందుతుంది. ఇందులో మీకు నచ్చిన రకరకాల పాటలను పూర్తిగా ఆస్వాదించవచ్చు. 2 మిలియన్ పాటలు ఇక్కడ ఉన్నాయి.

Read Free Kindle eBooks

Read Free Kindle eBooks

టాప్ 100 రచయితల బుక్స్ మీకు ఇక్కడ పూర్తి ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ లిమిట్ లో మాత్రమే ఉంటుంది. ప్రైమ్ మెంబర్ షిప్ గల సభ్యులు 1000కి పైగా పుస్తకాలను ఇందులో చదువుకునే అవకాశం ఉంది.

Watch Free Movies and TV Shows

Watch Free Movies and TV Shows

వేయికి పైగా సినిమాలో ఇందులో ఉన్నాయి. ఇవి పూర్తి ఉచితంగా లభిస్తాయి. అలాగే టీవీషోలు కూడా ఉచితంగా చూడవచ్చు. అయితే ఇవన్నీ ఆస్వాదించాలంటే ప్రైమ్ మెంబర్ షిప్ ఉండి తీరాలి.

Get Free Shipping

Get Free Shipping

మీరు ఏదైనా అమెజాన్లో కొనుగోలు చేస్తే మీకు ఉచితంగా డెలివరీ అందుతుంది. మీరు కొనుగోలు చేసే మొత్తంతో సంబంధం లేకుండా మీకు ఉచితంగా డెలివరీ చేసే సౌకర్యం పూర్తి ఉచితంగా లభిస్తుంది.

Gift Cards, Sample Boxes

Gift Cards, Sample Boxes

Get Free Amazon Credits and Gift Cards
మీరు ఉచితంగా గిఫ్ట్ కార్డులు అందుకోవచ్చు.
Order Free Sample Boxes
మీకు అమెజాన్ బాక్సులు కావాలంటే పూర్తి ఉచితంగా ఆర్డర్ చేయవచ్చు. దీనికి మీరు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదు.

Free Audio Books

Free Audio Books

Listen to Free Audio Books
ఆడియో బుక్స్ కూడా మీకు పూర్తి ఉచితంగా లభిస్తాయి. మీరు బుక్స్ చదివే తీరిక లేకుండా ఆడియో బుక్స్ వినవచ్చు.
Receive Free Items to Review
మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ముందుగా చూసేది ఆ వస్తువు రివ్యూనే కదా..ఇది మీకు పూర్తి ఉచితంగా అమెజాన్లో లభిస్తుంది.
Store Unlimited Photos for Free
అమెజాన్ ప్రైమ్ మెబర్లకు ఫోటోలను స్టోర్ చేసుకునేందుకు అన్ లిమిటెడ్ స్పేస్ ని అందిస్తోంది. మీకు మొత్తంగా 5జిబి స్టోరేజిని అమెజాన్ ఉచితంగా అందిస్తోంది.

Best Mobiles in India

English summary
Amazon Prime Reading offers unlimited access to eligible eBooks, comics and more for Prime members in India more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X