అమెజాన్ ప్రైమ్ యొక్క ఉచిత ట్రయిల్, ఒక నెల సబ్స్క్రిప్షన్ ప్లాన్ తొలగించారు!!!

|

భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత ఉపయోగకరమైన OTT సబ్స్క్రిప్షన్ సర్వీసులలో అమెజాన్ యొక్క ప్రైమ్ ఒకటి. ఇది మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్ యాప్, ఎంటర్టైన్మెంట్ యాప్ మరియు అమెజాన్ షాపింగ్ యాప్ లకు గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. దీనిని చాలావరకు వీడియో స్ట్రీమింగ్ కోసం లేదా మరొకటి షాపింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఇది కంటెంట్ వినియోగం కోసం ప్రైమ్ వీడియో లేదా వస్తువులను కొనడానికి అమెజాన్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నారు.

ప్రైమ్ సబ్స్క్రిప్షన్

నెట్‌ఫ్లిక్స్ తో పోల్చితే దీని యొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్ చాలా చౌకగా ఉంది. దీనిని విభిన్న వాలిడిటీలతో అందిస్తుంది. అయితే ఒక నెల బేస్ వ్యవధితో లభించే ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ ఇది ఇకపై ఆఫర్‌లో ఉండదు. ఈ సంస్థ ఇకమీదట మూడు నెలలు లేదా వార్షిక ప్రైమ్ సభ్యత్వాన్ని మాత్రమే అందిస్తుంది. కంపెనీ ఒక నెల ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను ఎందుకు తొలగించింది? వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక నెల ప్లాన్ తొలగించబడింది

అమెజాన్ ప్రైమ్ యొక్క ఒక నెల ప్లాన్ తొలగించబడింది

రిజర్వ్ బ్యాంక్ యొక్క కొత్త ఆదేశం కారణంగా ఇకపై అమెజాన్ ప్రైమ్ యొక్క నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను అందించబోమని అమెజాన్ కంపెనీ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ యొక్క నెలవారి ప్లాన్ చాలా చౌకగా లభిస్తుంది. దీని నెలవారి సబ్స్క్రిప్షన్ ధర కేవలం రూ.129 మాత్రమే. ఆర్‌బిఐ నుండి వచ్చిన కొత్త మార్గదర్శకాల విషయానికి వస్తే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను పునరావృతమయ్యే ఆన్‌లైన్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి అదనపు యాక్సిస్ ను తీసుకురావాలని కోరుతున్నాయి. సెప్టెంబర్ 30 వరకు ఈ గడువు ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్

అమెజాన్ ప్రైమ్ కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తొలగించడాన్ని తెలుపుతూ అమెజాన్ యొక్క మద్దతు పేజీని అప్ డేట్ చేస్తూ ప్రదర్శించింది. దీనికి తోడు ఏప్రిల్ 27 నుండి సంస్థ యొక్క ఉచిత ట్రయల్స్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి వినియోగదారులు ఎవరైనా అమెజాన్ ప్రైమ్‌లో చేరాలని కోరుకుంటే కనుక వారు మూడు నెలల సభ్యత్వాన్ని కొనుగోలు చేయవచ్చు. మూడు నెలల సబ్స్క్రిప్షన్ ధర 329 రూపాయలు. అలాగే వార్షిక ప్లాన్ ను 999 రూపాయల ధర వద్ద కూడా పొందవచ్చు.

ఆర్‌బిఐ ఫ్రేమ్‌వర్క్‌

వాస్తవానికి 2019 ఆగస్టులో మొదటిసారి ప్రకటించిన ఆర్‌బిఐ ఫ్రేమ్‌వర్క్‌ను ఇప్పుడు తిరిగి 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. వినియోగదారులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి ఈ గడువు పొడిగించబడింది. 2019 ప్రారంభంలో ఆర్‌బిఐ రూ.2,000 వరకు పునరావృతమయ్యే లావాదేవీల కోసం AFA ను రూపొందించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. కాని తరువాత ఆ నిబంధనను లావాదేవీలకు 5,000 రూపాయల పరిమితి వరకు విస్తరించింది. వినియోగదారులు కొంతమంది స్వల్ప కాలానికి చందాను పొందుతున్నందున నెలవారీ ప్లాన్ను తొలగించడం వలన అమెజాన్ ప్రైమ్ యొక్క మొత్తం సభ్యత్వాలు విజయవంతమవుతాయా లేదో అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Amazon Prime's Free Trial and One Month Subscription Plan Removed in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X