అమెజాన్ ప్రైమ్ చందా ధరలు భారతదేశంలో భారీగా పెరగనున్నాయి!!

|

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT సబ్స్క్రిప్షన్ లలో అమెజాన్ ప్రైమ్ ఒకటి. ఒక స్థిర మొత్తాన్ని చెల్లించడం ద్వారా వినియోగదారులు అమెజాన్ ఉత్పత్తులు మరియు సర్వీసుల సూట్‌కి యాక్సెస్ పొందుతారు. కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ యొక్క సూట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ మరియు ఆర్డర్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వంటివి ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ గురించి ప్రజలు ఇష్టపడే విషయం ఏమిటంటే ఇది చాలా ఖరీదైనది కాదు. వినియోగదారులు దీనిని పూర్తిగా సంవత్సరానికి రూ.999 ధరతో పొందవచ్చు. అయితే అది త్వరలో మారబోతోంది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ యొక్క సబ్స్క్రిప్షన్ ధర త్వరలో రూ.500 ధరల పెంపును పొందబోతోంది.

 

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 50% ఖరీదైనదిగా మారుతుంది

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 50% ఖరీదైనదిగా మారుతుంది

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రస్తుత ధర కంటే 50% ఎక్కువ ఖరీదు అవుతుందని అమెజాన్ ధృవీకరించింది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ వెబ్‌పేజీలో కంపెనీ కొత్త ధరల నమూనాను అప్‌డేట్ చేసింది. కొత్త ధర "అతి త్వరలో" ప్రారంభమవుతుందని కంపెనీ చెప్పింది కానీ ఖచ్చితమైన తేదీని ఇవ్వలేదు. దీని అర్థం రూ.500 ధర పెంపు తరువాత వార్షిక ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ యొక్క కొత్త ధర రూ.1,499 గా ఉంటుంది. ఇది మాత్రమే కాదు త్రైమాసిక మరియు నెలవారీ ప్లాన్ల ధరలు కూడా పెరుగుదలను చూస్తాయి. నెలవారీ ప్లాన్ రూ.129 నుండి రూ.179 కి, త్రైమాసిక ప్లాన్ రూ.329 నుండి రూ.459 కి పెరిగే అవకాశం ఉంది.

అమెజాన్

అమెజాన్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం అమెజాన్ ప్రైమ్ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుండి కంపెనీ వినియోగదారులకు అందించే విలువను మాత్రమే పెంచింది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా కొన్ని టెలికాం ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కస్టమర్‌లకు అందించడం గమనార్హం. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఖర్చు పెరగడంతో అలాంటి ప్లాన్‌లు కూడా ఖరీదైనవిగా మారే అవకాశాలు ఉన్నాయి. చందా ధర పెరుగుదలతో ప్రైమ్ చందాదారులకు నేరుగా కొత్త ప్రయోజనాలను జోడించబోతున్నట్లు కంపెనీ చెప్పలేదు. మీరు ఎప్పుడైనా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందడం గురించి ఆలోచిస్తే కనుక ఇప్పుడు ఉత్తమ సమయం.

ఎయిర్‌టెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఆఫర్
 

ఎయిర్‌టెల్ - అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఆఫర్

ఎయిర్‌టెల్ స,సంస్థ తన వినియోగదారులకు అందించే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రయోజనం ఒకే ఒక స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే పనిచేస్తుంది. భారతీ ఎయిర్‌టెల్ నుండి లభించే దాదాపు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. టెల్కో ద్వారా వినియోగదారులకు అందించే ఉచిత సబ్‌స్క్రిప్షన్ 1 నెల మాత్రమే చెల్లుబాటు అవుతుందని గమనించండి. అయితే ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో మెంబర్‌షిప్ ను ఉచితంగా పొందవచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్ యొక్క సాధారణ సభ్యత్వాన్ని అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్రయోజనంతో లభించే ప్లాన్ రూ.349 ధర వద్ద వస్తుంది. ఇది 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను స్వతంత్ర చందా వలె కొనుగోలు చేయలేము. ఇది అమెజాన్ బాహ్య భాగస్వాముల ద్వారా మాత్రమే వినియోగదారులకు అందించబడుతుంది. భారతదేశానికి సంబంధించి ఆ భాగస్వామి భారతి ఎయిర్‌టెల్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మొబైల్-ఓన్లీ ప్లాన్‌ను ప్రారంభించడానికి అమెజాన్ జనవరిలో ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది టెల్కో యొక్క చందాదారుల అదనపు లక్ష్యాన్ని ఎంత సానుకూలంగా ప్రభావితం చేసిందో చెప్పడానికి మార్గం లేదు.

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు

అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ను వినియోగదారులు ఎంచుకోవడానికి ఇప్పుడు మూడు వేర్వేరు సబ్‌స్క్రిప్షన్ మోడళ్ ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటిది రూ.129 ధర వద్ద లభించే ఒక నెల సబ్‌స్క్రిప్షన్, రెండోది రూ.329 ధర వద్ద లభించే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ మరియు మూడవది ఒక సంవత్సరం లేదా 12 నెలల చెల్లుబాటుతో లభించే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. ఇది రూ.999 ధర వద్ద లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క రూ.129 ఒక నెల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకున్న డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చని గమనించండి. ఆర్‌బిఐ ఇ-ఆదేశ మార్గదర్శకాలను పాటించని ఏదైన బ్యాంకుల కస్టమర్‌లు నెలవారీ ప్లాన్‌ను కొనుగోలు చేయలేరు. కొత్త నియమం కారణంగా లావాదేవీ పూర్తి కావడానికి ఇప్పుడు పునరావృత పేమెంట్స్ అడిషనల్ ఫ్యాక్టర్ అఫ్ అతంటికేషన్ (AFA) ని అడుగుతాయి. కొన్ని సమయాల్లో వారి సభ్యత్వాలను రద్దు చేయడం మర్చిపోయే వ్యక్తులకు ఇది మంచి నియమం. ఈ ప్లాన్ ఇప్పటికే అమెజాన్ వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది మరియు అర్హత ఉన్న బ్యాంకుల నుండి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను కలిగి ఉన్న వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Prime Subscription Membership Prices to Rise Sharply in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X