Home
News

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో షాకింగ్‌ నిర్ణయం.. ఇక నుంచి అలాంటి వాళ్లు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే..!!

ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే అకౌంట్‌ తో ఎక్కువ మంది ప్రైమ్‌ వీడియోను వినియోగిస్తుంటారు. తాజాగా నిర్ణయంతో ఈ తరహా యూజర్ల కు షాక్‌ ఇచ్చింది. ప్రైమ్ వీడియో అకౌంట్‌ ను టీవీలతోపాటు స్మార్ట్‌ ఫోన్, ట్యాబ్లెట్‌ లో లాగిన్‌ చేసి కంటెంట్‌ ను వీక్షించవచ్చు. తాజా నిర్ణయంతో ప్రైమ్‌ వీడియో ఒకే అకౌంట్‌ తో లాగిన్‌ అయ్యే డివైజ్‌ లపై అమెజాన్ ప్రైమ్‌ వీడియో పరిమితి విధించింది.

కొత్త నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ? :
తాజాగా ఇందుకు సంబంధించిన నిబంధనలను అప్‌డేట్‌ చేసింది. కొత్త నిర్ణయంతో ఒకే అకౌంట్‌ తో 5 డివైజ్‌ లు మాత్రమే కనెక్ట్‌ చేసేందుకు వీలుంది. ఈ ఐదింటిలో రెండు కంటే ఎక్కువ టీవీలను కనెక్ట్‌ చేసేందుకు అవకాశం లేదు. ఈ నిర్ణయం జనవరి 2025 నుంచి అమల్లోకి రానుందని అమెజాన్‌ తెలిపింది.

amazon prime video

సెట్టింగ్స్‌ ద్వారా డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకోవచ్చు :
ఒకే అకౌంట్‌ పై లాగిన్‌ అయ్యే డివైజ్‌ ల పరిమితి విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తమ యూజర్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. సెట్టింగ్స్‌ పేజీలో కనిపిస్తున్న మేనేజ్‌ ఆప్షన్‌ ద్వారా మార్పులు చేసుకోవచ్చని తమ యూజర్లకు అమెజాన్ సూచించింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇతర ప్రయోజనాలు :
ఇప్పటి వరకు ఒకే అకౌంట్‌ పై గరిష్ఠంగా 10 డివైజ్‌ లను కనెక్ట్‌ చేసుకొనే అవకాశం ఉండేది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అకౌంట్‌ ద్వారా కంటెంట్‌ తోపాటు అమెజాన్‌ షాపింగ్‌ ప్రయోజనాలను పొందవచ్చు. ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ మరియు ఒక్క రోజులోనే డెలివరీ వంటి సదుపాయాలను పొందవచ్చు.

amazon prime video

అమెజాన్ ప్రైమ్‌ వీడియో రీఛార్జ్‌ ప్లాన్‌ లు :
అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను తీసుకొనేందుకు ప్రస్తుతం అనేక ప్లాన్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, సంవత్సరం వ్యాలిడిటీని అందించే ప్లా్న్‌లు ఉన్నాయి. దీంతోపాటు ప్రైమ్‌ లైట్‌ (Prime Video Lite) కూడా అందుబాటులో ఉంది. దీంతోపాటు కేవలం అమెజాన్‌ షాపింగ్‌ ప్రయోజనాలను పొందేందుకు కూడా ప్రత్యేక ప్లాన్‌ ను కలిగి ఉంది.

అమెజాన్ ప్రైమ్‌ నెలరోజుల (Prime Video Recharge Plans) ప్లాన్ కోసం రూ.299, మూడు నెలల ప్లాన్‌ కోసం రూ.599, సంవత్సరం వ్యాలిడిటీ కోసం రూ.1,499 తో రీఛార్జ్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లతో యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ ను వీక్షించవచ్చు. అదే రూ.799 రీఛార్జ్‌తో సంవత్సరం పాటు ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

కేవలం షాపింగ్‌ కోసం రూ.399 రీఛార్జ్ :
వీడియో కంటెంట్‌ తో సంబంధం లేకుండా కేవలం అమెజాన్ షాపింగ్‌ ప్రయోజనాలను పొందేందుకు రూ.399 తో రీఛార్జ్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ తో క్యాష్‌బ్యాక్‌లు, ప్రత్యేక సేల్‌లో భాగంగా Early Access సహా ఆర్డర్‌ చేసిన రోజు డెలివరీ, ఒక్క రోజులోనే డెలివరీ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
amazon prime video new rules that will restrict device limit from january 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X