Amazon Sale అమెజాన్ ప్రైమ్ డే 2025.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు..!
Amazon prime day 2025 : అమెజాన్ ప్రైమ్ డే 2025 జులై 12-14 వరకు జరగనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. గతంలో ప్రైమ్ డే సేల్‌ను కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించగా.. త్వరలో ప్రారంభం కానున్న సేల్ మాత్రం 3 రోజులపాటు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణాలు, అమెజాన్ డివైజ్‌లతోపాటు అనేక ఉత్పత్తులను భారీ డిస్కౌంట్ కు కొనుగోలు చేయవచ్చని చెబుతోంది.
అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్‌లో భాగంగా SBI, ICICI బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. వచ్చే వారం చివర్లో ఈ సేల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెజాన్ ఈ సేల్ డిల్స్‌ను వెల్లడిస్తోంది. ఈ సేల్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.

ఈ సేల్‌లో భాగంగా అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు కూడా సేల్‌లోకి రానున్నాయి. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ M36 5G, వన్‌ప్లస్ నార్డ్ CE 5, వన్‌ప్లస్ నార్డ్ 5 వంటి స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇతర కొత్త ఉత్పత్తులను ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేయవచ్చు.
దీంతోపాటు ఐకూ Z10 లైట్ 5G, ఐకూ 13, రియల్‌మి నార్జో 80 లైట్ 5G, ఒప్పో రెనో 14 సిరీస్, హానర్ X9c 5G, లావా స్ట్రోమ్ లైట్ 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, సంబంధిత ఉత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
కొత్తగా లాంచ్ అయిన, లాంచ్ కానున్న ఫోన్‌లతోపాటు ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, వన్‌ప్లస్ 13s, ఐకూ నియో 10R వంటి హ్యాండ్‌సెట్‌లను కూడా డిస్కౌంట్ ధరలకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లను గరిష్ఠంగా 40 శాతం డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.
అదే విధంగా ట్యాబ్లెట్స్, స్పీకర్‌లను గరిష్ఠంగా 60 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE మోడల్‌ను రూ.28999 కే సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. వీటితోపాటు కెమెరాలు, స్మార్ట్‌వాచ్ తరహా ఉత్పత్తులను గరిష్ఠంగా 50 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.
ప్రైమ్ డే 2025 సేల్‌లో భాగంగా గరిష్ఠంగా 65 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇందులో శాంసంగ్, సోనీ, షియోమీ, TCL, LG సహా అనేక బ్రాండ్‌లున్నాయి. LG, శాంసంగ్, IFB, Bosch బ్రాండ్స్ వాషింగ్ మెషిన్‌లపై గరిష్ఠంగా 60 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
డైకిన్, LG, Carrier వంటి ఎయిర్ కండిషనర్లపై గరిష్ఠంగా 60 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు గోద్రెజ్, శాంసంగ్, Haier వంటి రీఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చని అమెజాన్ చెబుతోంది. వీటితోపాటు అమెజాన్ స్మార్ట్ డివైజ్‌లతోపాటు ఇతర డివైజ్‌లపై ఆకట్టుకొనే డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా Echo Dot (5వ జెన్) ను రూ.4449 కే కొనుగోలు చేయవచ్చు. Echo Pop ను రూ.2949 కే సొంతం చేసుకోవచ్చు. ఫైర్ TV Stick HD రూ.2499, ఫైర్ TV Stick 4K ను రూ.4449 కే, కిండిల్ పేపర్‌వైట్ ను రూ.13999 కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications







