అమెజాన్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ మెషీన్లులో టెక్నికల్ ప్రాబ్లమ్, లబోదిబోమంటున్న అమెరికన్‌ సెనెటర్లు

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ టెక్నాలజీ తో అమెరికన్‌ సెనెటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By Anil
|

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ టెక్నాలజీ తో అమెరికన్‌ సెనెటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అమెజాన్‌కు చెందిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ మెషీన్లు వారి గుర్తింపును తప్పు తప్పుగా చూపిస్తున్నట్టు వారు వాపోతున్నారు.కాగా సెనేటర్లను ఆ ఫేషియల్‌ రికగ్నిషన్‌ మెషీన్లు కరుడుగట్టిన క్రిమినల్స్‌గా గుర్తిస్తుండటంతో వారు ప్రతి సారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య చాలా రోజులు నుంచి ఉన్న మే నెల నుంచి మాత్రం మరీ ఎక్కువైపోయిందని ప్రముఖ సర్వే సంస్థ ది ఏఎల్‌సీయూ(అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ ఆఫ్‌ నార్తన్‌ కాలిఫోర్నియా) ఓ నివేదికలో వెల్లడించింది.ఎక్కువగా ఈ పొరపాటును ఓరెగాన్‌, ఓర్లాండో, ఫ్లోరిడాలోని సెనెటర్ల కోసం ఏర్పాటు చేసిన మెషీన్లలో గుర్తించారు . లూయిస్‌, డీ మాస్‌,ఎడర్వర్డ్‌ మార్కే ఇతర దిగ్గజాలను కలిపి ఇలా మొత్తం 28 మంది సెనెటర్లను క్రిమినల్స్‌గా ఫేషియల్‌ రికగ్నిషన్‌ చేస్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఫేషియల్‌ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా ...

ఫేషియల్‌ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా ...

చట్టసభల్లో, కార్యాలయాల్లో, సమావేశాల్లో వాళ్లు పాల్గొన్నప్పుడు సెనెటర్లను ఫేషియల్‌ సర్వైలెన్స్ కెమెరాలు వారిని క్రిమినల్స్‌గా చూపిస్తున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారి వద్దకు వెళ్తున్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతున్నాయి అని ఏసీఎల్‌యూ పేర్కొంది.

కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది....

కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది....

ఒక్క కాలిఫోర్నియాలోనే 25,000 వేల మంది డేటా అమెజాన్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంది. అలాంటప్పుడు రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలను కూడా ఈ పొరపాటుతో ముప్పు తలెత్తే అవకాశం ఉందని ఏఎల్‌సీయూ చెబుతుంది . గతంలో ఈ విషయం ఫై కొందరు సెనెటర్లు పిర్యాదులు చేసిన ఎలాంటి స్పందన లేకుండా పోయింది.

అమెజాన్‌ మాత్రం తమ పొరపాటును....

అమెజాన్‌ మాత్రం తమ పొరపాటును....

అయితే అమెజాన్‌ మాత్రం తమ పొరపాటును సర్దిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తోంది. ‘ఒక వ్యక్తి రియల్‌ టైమ్‌ ఇమేజ్‌లను పాత ఫొటోలతో పోల్చి ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ పనిచేస్తుందని అలాంటప్పుడు తప్పు మాది కాదు అని సదరు ఏజెన్సీ సంస్థలదే అని అమెజాన్‌ చెబుతుంది.

పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా...

పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా...

చిన్న చిన్న పార్కుల్లో పిల్లలు తప్పిపోయిన సమయంలో కూడా అమెజాన్‌ మెషీన్లనే ఉపయోగిస్తున్నారని, అక్కడ ఎవరికీ రాని ఇబ్బందులు ఇక్కడ మాత్రమే ఎందుకొస్తున్నాయన్న వాదనను అమెజాన్‌ తెరపైకి తెచ్చింది .అయితే ఏల్‌సీయూ మాత్రం మెషీన్లలో 80 శాతం ఇన్‌స్టాలైజేషన్‌లో పొరపాట్లు ఉన్నాయని, కావాలంటే బహిరంగంగా నిరూపిస్తామని చెబుతుంది.

చాలా మంది అభిప్రాయం ....

చాలా మంది అభిప్రాయం ....

ఈ టెక్నాలజీపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టి వినియోగదారుల్లో నమ్మకం పెంచాల్సిన అవసరం అమెజాన్ దే అని చాల మంది అభిప్రాయ పడ్తున్నారు.

 

 

Best Mobiles in India

English summary
Amazon.com's facial recognition tools incorrectly identified Rep. John Lewis, D-Ga., and 27 other members of Congress as people arrested for a crime during a test commissioned by the American Civil Liberties Union of Northern California, the watchdog said Thursday.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X