అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది: అందుబాటులో 15 వేల ఉద్యోగాలు

|

ప్రముఖ గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అతిపెద్ద మరియు మొదటి క్యాంపస్‌ను US వెలుపల హైదరాబాద్ లో ప్రారంభించింది. నానక్రమ్‌గుడలో 9.5 ఎకరాల ప్రాంగణంలో ఇండియాలోనే అతి పెద్ద అమెజాన్ యొక్క మొదటి క్యాంపస్‌ను చాలా మంది అతిరథుల మధ్య ప్రారంభించారు. ఈ అమెజాన్ యొక్క క్యాంపస్‌లో సుమారు15 వేల మంది ఉద్యోగులు పని చేయడానికి అవకాశం ఉంటుంది. అమెజాన్‌లో భారతదేశం మొత్తం మీద ఇప్పటికే సుమారు 62,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

Amazons Largest Campus Opens in Hyderabad: 15 Thousand Jobs Available

అమెజాన్ యొక్క ఈ క్యాంపస్‌ యొక్క విస్తీర్ణం సుమారు 3 మిలియన్ చదరపు అడుగులు. ఇందులో కార్యాలయం 1.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణ స్థలంలో నిర్మించబడింది. అమెజాన్ యొక్క కార్యాలయం విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.

ఓపెనింగ్ కార్యక్రమం:

ఓపెనింగ్ కార్యక్రమం:

అమెజాన్ క్యాంపస్‌ను తెలంగాణ హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరియు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ మరియు అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్ ప్రారంభించారు.

కార్యక్రమ విషయాలు:

కార్యక్రమ విషయాలు:

గత 15 సంవత్సరాలుగా అమెజాన్ భారతదేశంలో ముంబైలోని AWS APAC ప్రాంతంలో 30 వేరు వేరు కార్యాలయాలు. అలాగే 13 రాష్ట్రాల్లో 50 ఫుల్ ఫిల్మెంట్ కార్యాలయ కేంద్రాలు, అలాగే వందలాది డెలివరీ మరియు సార్టింగ్ కేంద్రాలు, దాదాపు 200,000 ఉద్యోగాలను సృష్టించాము అని అగర్వాల్ చెప్పారు.

క్యాంపస్‌ వివరాలు:
 

క్యాంపస్‌ వివరాలు:

అమెజాన్ క్యాంపస్‌ను హైదరాబాద్ లో ప్రారంభించడం ద్వారా US వెలుపల అతిపెద్ద ఉద్యోగుల సంఖ్యను కలిగి ఉంటుంది. మూడేళ్లలోనే ఈ క్యాంపస్‌ను నిర్మించినట్లు షోట్లర్ తెలిపారు. ఈ క్యాంపస్‌లో ఇంటర్‌ఫెయిత్ ప్రార్థన గదులు,చంటి బిడ్డల కోసం మరొక గది, నిశ్శబ్ద గదులు, షవర్లు, హెలిప్యాడ్ మరియు రోజంతా ఓపెన్ చేయబడి ఉన్న కెఫెటేరియాలు ఉన్నాయి.

క్యాంపస్‌ అడ్రస్:

క్యాంపస్‌ అడ్రస్:

అమెజాన్ హైదరాబాద్‌లో అతిపెద్ద ఇండియా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని కలిగి ఉంది. 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో నానక్రమ్‌గుడలో ఉంది. వచ్చే ఏడాది నాటికి దీన్ని 580,000 చదరపు అడుగులకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని మినహాయించి అమెజాన్ ఇప్పుడు హైదరాబాద్లో మరొక ఎనిమిది కేంద్రాలలో 4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కలిగి ఉంది.

అమెజాన్ యాప్‌స్టోర్‌:

అమెజాన్ యాప్‌స్టోర్‌:

గత వారం అమెజాన్ సంస్థ భారతదేశంలో కొత్త మార్కెట్ ప్లేస్ యాప్‌స్టోర్‌ను ఆవిష్కరించింది. ఇది వ్యాపార-కేంద్రీకృత ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం. ఇది భారతదేశంలో అమ్మకందారులకు వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి సహాయపడుతుంది. ప్లాట్‌ఫాం అమ్మకందారులకు తమ వ్యాపారాన్ని తమఅంతట తాము అభివృద్ధి చేసుకోవడానికి మరియు నిర్వహించడానికి సహాయపడే విశ్వసనీయ థర్డ్ పార్టీ యాప్ లను కనుగొనడంలో సహాయపడుతుంది.

యాప్‌స్టోర్‌ ఉపయోగం:

యాప్‌స్టోర్‌ ఉపయోగం:

అమెజాన్ మార్కెట్‌ప్లేస్ యాప్‌స్టోర్ అమ్మకందారులకు వారి వ్యాపారంపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఎందుకంటే ఇది వారి నిర్దిష్ట అవసరాలకు సరైన పరిష్కారాన్ని కనుగొనటానికి మరియు వారు వెచ్చించే సమయం మరియు కృషిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా షిప్పింగ్ ప్రొవైడర్ లేదా సేల్స్ అనలిటిక్స్ సాధనాన్ని కనుగొనవచ్చు. అంతేకాకుండా మార్కెట్‌ప్లేస్ యాప్‌స్టోర్‌లోని యాప్ లను వారి అవసరాలకు తగిన పరిష్కారాన్ని కనుగొనడానికి సెర్చ్ చేయవచ్చు, ఫిల్టర్ చేయవచ్చు మరియు పోల్చవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon's Largest Campus Opens in Hyderabad: 15 Thousand Jobs Available

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X