అమెజాన్‌లో ఆ ప్రొడక్ట్స్ 99 శాతం డిస్కౌంట్.. కట్ చేస్తే!
అమెజాన్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని పలు ప్రొడక్ట్స్ పై 99 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తుందంటూ ఓ ఫేక్ మెసేజ్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది.
అమెజాన్ తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోని పలు ప్రొడక్ట్స్ పై 99 శాతం వరకు డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తుందంటూ ఓ ఫేక్ మెసేజ్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ మెసేజ్ మీ వాట్సాప్ అకౌంట్‌కి కూడా షేర్ అయినట్లయితే వెంటనే దానిని డిలీట్ చేసేయండి. వాస్తవానికి ఈ మెసేజ్ ఒక పెద్ద స్కామ్.

వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న
వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న ఈ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే అచ్చం అమెజాన్ పేజీలా కనిపిస్తోన్న మరో పేజీలోకి యూజర్ రీడైరెక్ట్ అవుతున్నారు. ఈ నకిలీ వెబ్ పేజీలో రూ.1 ధర ట్యాగ్ తో అనేక ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొడక్ట్‌ను సెలక్ట్ చేసుకుని బయ్ నౌ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే యూజర్ అడ్రస్ వివరాలతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలను అడుగుతోంది. ఈ వివరాలను బ్యాంక్ అకౌంట్లను స్నూప్ చేసేందుకు హ్యాకర్లు వినియోగించుకుంటున్నారు.

ఈ హోక్స్ పేజీకి సంబంధించిన
ఈ హోక్స్ పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ ఈ విధంగా ఉంది. http://amzn.biggest -sale.live.in. ఈ అన్‌సెక్యూర్ లింక్‌లోకి పొరపాటున కూడా ఈ లింక్‌లోకి వెళ్లకండి. ఏదైన నెంబర్ నుంచి మీకు ఈ లింక్‌తో ఉన్న మెసేజ్ షేర్ అయినట్లయితే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయండి.

వాట్సాప్ వినియోగం విపరీతంగా
వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్‌కు ఫేక్ న్యూస్ బెడద ఎక్కువైంది. నకలీ వార్తలకు అడ్డుకట్ట వేసే క్రమంలో దేశవ్యాప్త ప్రచారానికి వాట్సాప్ శ్రీకారం చుట్టింది. వాట్సాప్ వినియోగం విపరీతంగా విస్తరిస్తోంది. ఈ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ రాకతో సోషల్ నెట్ వర్కింగ్ మరింత వేగాన్ని పుంజుకుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్‌కు ఫేక్ న్యూస్ బెడద ఎక్కువైంది. నకలీ వార్తలకు అడ్డుకట్ట వేసే క్రమంలో దేశవ్యాప్త ప్రచారానికి వాట్సాప్ శ్రీకారం చుట్టింది.

ఇండియాలోని యూజర్ల కోసం సరికొత్త రూల్స్
ఇదే సమయంలో ఇండియాలోని యూజర్ల కోసం సరికొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది. ఒక వేళ ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా జైలులో ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుంది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ ఇతర సభ్యులతో భాద్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. బాడీ ట్రేడ్, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలపాలను ప్రోత్సహించకూడదు. ఇతర వ్యక్తుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని షేర్ చేయకూడదు. ఆడవారిని వేధించడం, కులం, మతం, ప్రాంతం వంటి సున్నితమైన అంశాల పట్ల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించటం, నకిలీ మెసేజ్‌లను వ్యాపింపజేయటం వంటి పనులను చేయకూడదు.


Click it and Unblock the Notifications








