ముళ్ల బాట నుంచి పూలదారిలోకి, అపర కుబేరుడి జీవితంలోని రహస్యాలు

|

బిల్‌గేట్స్‌ను దాటేసి ప్రపంచ కుబేరుడిగా నిలిచిన అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ కంపెనీ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా అవతరించింది. కాగా ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన రెండో కంపెనీ ఇదే. ఇటీవలే ఐఫోన్‌లు తయారు చేసే ఆపిల్‌ కంపెనీ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్‌ సాధించింది.

కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చ్ంజ్‌లో అమెజాన్‌ షేర్‌ 2% లాభంతో 2,050 డాలర్లను తాకింది. ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. ఆపిల్‌ ఈ ఘనత సాధించిన 5 వారాల తర్వాత అమెజాన్‌ ఈ మైలురాయిని దాటింది. అయితే ఈ విజయం ఊరికే రాలేదు. దాని వెనక ఎన్నో ముళ్లు ఉన్నాయి. జెఫ్ బిజోస్ జీవితంలోని వాస్తవాలను ఓ సారి పరిశీలిస్తే..

 

నాడు పుస్తకాలు అమ్మాడు, నేడు ప్రపంచ కుబేరుడయ్యాడు, నివ్వెరపరిచే వాస్తవాలు !

ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీ..

ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీ..

ఆరంభంలో పుస్తకాలు అమ్మిన అమెజాన్‌ కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. ఇరవై ఏళ్లలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీగా నిలిచింది. అమెజాన్‌ విజయంతో ఈ కంపెనీ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించాడు.

బెజోస్‌ పుట్టిన కొన్నాళ్లకే ..

బెజోస్‌ పుట్టిన కొన్నాళ్లకే ..

బెజోస్‌ పుట్టిన కొన్నాళ్లకే టీనేజీ దంపతులైన అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన తల్లి జాకీతో కలిసి టెక్సాస్, ఫ్లోరిడాల్లో పెరిగారు. అతని మారు తండ్రి మైక్ బెజోస్ ఎక్సాన్ సంస్థ ఎగ్జిక్యూటివ్. క్యూబాలో కాస్ట్రో అధికారంలోకి రావడంతో మైక్ అక్కడి నుంచి పారిపోయి అమెరికా చేరుకున్నారు.

నా 16 ఏళ్ల వయసున్నప్పుడు..
 

నా 16 ఏళ్ల వయసున్నప్పుడు..

జెఫ్‌ బెజోస్‌ అమెరికాకు వచ్చిన తొలి రోజుల్ని ఓ సంధర్భంలో గుర్తుచేసుకున్నారు. '' నా 16 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న అమెరికా వచ్చారు. ఒకడే ఈ దేశంలోకి అడుగుపెట్టారు. కనీసం ఇంగ్లీష్‌ మాట్లాడటం కూడా రాదు. డెలావేర్‌లో కొన్ని గొప్ప సంస్థల సాయంతో మా నాన్న ఓ గొప్ప పౌరుడిగా ఎదిగారు'' అని తెలిపారు.

సూది నుంచి రూ.82 లక్షల విలువ చేసే 105 అంగుళాల సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ వరకు..

సూది నుంచి రూ.82 లక్షల విలువ చేసే 105 అంగుళాల సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ వరకు..

రెండు దశాబ్దాల క్రితం జెఫ్ బెజోస్ భవిష్యత్తును చూడగలిగారు. మాల్స్ ప్రాధాన్యత కోల్పోతాయని, సూది నుంచి రూ.82 లక్షల విలువ చేసే 105 అంగుళాల సామ్‌సంగ్ స్మార్ట్ టీవీ వరకు ఒక క్లిక్‌తో ఆర్డర్ చేయొచ్చని గుర్తించారు. ఆ ఆలోచన ఆధారంగానే ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు.

1994లో..

1994లో..

1994లో ఒక సెకెండ్ హాండ్ బుక్ షాపు నుంచి అమెజాన్ ఇప్పుడు అనేక రకాల సేవలను అందించే ప్రపంచ మొట్టమొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది.

1995లో..

1995లో..

1995లో అమెజాన్‌ను ప్రారంభించిన నెల లోపే అది అమెరికాలోని 50 రాష్ట్రాలు, దాదాపు 45 దేశాలలో తన లావాదేవీలు ప్రారంభించినట్లు బ్రాడ్‌స్టోన్ తన 'ద ఎవ్రీథింగ్ స్టోర్: జెఫ్ బెజోస్ అండ్ ద ఏజ్ ఆఫ్ అమెజాన్' పుస్తకంలో వెల్లడించారు.

వచ్చే ఏడాదికి అంతరిక్ష యాత్ర ..

వచ్చే ఏడాదికి అంతరిక్ష యాత్ర ..

ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక ఆయన సొంతం. ఆయన ఏరోస్పేస్ సంస్థ బ్లూ ఆరిజిన్ వచ్చే ఏడాదికి అంతరిక్ష యాత్ర టికెట్లు విక్రయించే ఆలోచనలో ఉంది.

చిన్నతనంలో..

చిన్నతనంలో..

చిన్నతనంలో జెఫ్ బెజోన్ సైన్స్, ఇంజనీరింగ్‌ల పట్ల అమితాసక్తి కనపరిచేవారు. హైస్కూల్లో చదువుతుండగా చేసిన ప్రసంగంలో, అంతరిక్షంలో కాలనీలు నిర్మించాలన్నది తన లక్ష్యం అని పేర్కొన్నారు.

భార్య మెకంజీతో..

భార్య మెకంజీతో..

ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు. తర్వాత డీఈ షా హెడ్జ్ ఫండ్‌లో చేరారు. అక్కడే తన భార్య మెకంజీతో ఆయనకు పరిచయమైంది.

30 ఏళ్ల వయసులో..

30 ఏళ్ల వయసులో..

30 ఏళ్ల వయసులో ఇంటర్నెట్ అతి వేగంగా విస్తరిస్తున్న తీరు చూసి, ఆయన షా సంస్థకు రాజీనామా చేశారు.2010లో ప్రిన్స్‌టన్‌లో చేసిన ప్రసంగంలో బెజోస్, అమెజాన్‌ను ప్రారంభించడం చాలా రిస్కు అని అంగీకరించారు.

ఒకసారి ప్రయత్నించి విఫలమైనా ..

ఒకసారి ప్రయత్నించి విఫలమైనా ..

జీవితాంతం మనం అసలు ప్రయత్నించనే లేదు అని బాధపడడం కంటే ఒకసారి ప్రయత్నించి విఫలమైనా ఫర్వాలేదనుకున్నా'' అని అన్నారు బెజోస్.

మొదటి ఐదేళ్లలో

మొదటి ఐదేళ్లలో

అమెజాన్ ప్రారంభమైన మొదటి ఐదేళ్లలో దాని కస్టమర్ అకౌంట్ల సంఖ్య 1,80,000 నుంచి 1.7 కోట్లకు చేరింది. దాని అమ్మకాలు రూ.3.5 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు చేరుకున్నాయి.

చాలా పెద్ద కంపెనీలు..

చాలా పెద్ద కంపెనీలు..

చాలా పెద్ద కంపెనీలు కూడా దానిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. 1997లో అది పబ్లిక్ కంపెనీగా మారి, రూ.370 కోట్లు సమీకరించింది. దాంతో బెజోస్ 35 ఏళ్లలోపే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు.

అమెజాన్ ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు

అమెజాన్ ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు

అయితే అమెజాన్ ప్రస్థానంలో కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. మొదట్లో పెట్స్ డాట్ కామ్ లాంటి సైట్లలో పెట్టుబడి పెట్టడం నష్టాన్ని తెచ్చింది. అమెజాన్‌ది గుత్తాధిపత్యం అంటూ విమర్శించే వారూ ఉన్నారు. అంతే కాకుండా పన్నులు, కార్మిక విధానాల విషయంలో కూడా అది అవలంబించే విధానాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లాబీయింగ్‌పై ఎక్కువగా ఖర్చు..

లాబీయింగ్‌పై ఎక్కువగా ఖర్చు..

అమెజాన్ లాబీయింగ్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తోందంటూ ఓపెన్ సీక్రెట్స్ డాట్ ఓఆర్‌జీ 2014లో పేర్కొంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యూఎస్ పోస్టల్ సర్వీస్ నుంచి తక్కువ ధరలకే తన ఉత్పత్తులను వినియోగదారులకు పంపేలా అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుందని, దానిపై నియంత్రణలు విధిస్తామని హెచ్చరించారు.

దాతృత్వ కార్యక్రమాలను ..

దాతృత్వ కార్యక్రమాలను ..

ఈ విమర్శల నడుమే జెఫ్ బెజోస్ ఇటీవలే తన దాతృత్వ కార్యక్రమాలను మరింత ఎక్కువ చేస్తానని తెలిపారు. అయితే అవి వ్యాపారంలో మాదిరి దీర్ఘకాలికంగా కాకుండా వెంటనే ఫలితాలు ఉండేలా చూస్తానని అన్నారు.

దిడ్రీమ్‌.యూఎస్‌కు..

దిడ్రీమ్‌.యూఎస్‌కు..

ఇందులో భాగంగానే నాన్‌-ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌ దిడ్రీమ్‌.యూఎస్‌కు 33 మిలియన్‌ డాలర్లను (రూ.209కోట్లను) విరాళంగా అందించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని శరణార్థ విద్యార్థులకు కాలేజీ స్కాలర్‌షిప్‌లుగా అందించనున్నారు.

వెయ్యి స్కాలర్‌షిప్‌లకు ఈ నిధులను..

వెయ్యి స్కాలర్‌షిప్‌లకు ఈ నిధులను..

జెఫ్‌ బెజోస్‌, ఆయన భార్య మెకంజీ అతిపెద్ద విరాళం అందించారని దిడ్రీమ్‌.యూఎస్‌ తెలిపింది. వెయ్యి స్కాలర్‌షిప్‌లకు ఈ నిధులను వాడనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు తాము అందుకున్న వాటిలో ఇదే పెద్ద మొత్తమని చెప్పింది.

1994లో సియాటెల్‌లో..

1994లో సియాటెల్‌లో..

1994లో సియాటెల్‌లో జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ను స్థాపించారు. 1997లో 18 డాలర్లకు ఐపీఓకు వచ్చింది. ఇప్పుడు కంపెనీ షేర్‌ ధర 2,050 డాలర్లను తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఈ షేర్‌ 70% ఎగసింది.

150 బిలియన్ డాలర్ల మార్క్‌ ..

150 బిలియన్ డాలర్ల మార్క్‌ ..

ఆధునిక చరిత్రలో ఇప్పటి దాకా ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆయన వ్యక్తిగత సంపాదన 150 బిలియన్ డాలర్ల మార్క్‌ దాటింది. 49 పేద దేశాల జీడీపీని కలిపినా.. ఆయన సగటు ఆస్తుల విలువే ఎక్కువంటే ఆశ్చర్యం కలగక మానదు.

56వ ధనిక దేశంగా..

56వ ధనిక దేశంగా..

హంగేరీ జీడీపీ కంటే కూడా బెజోస్ ఆస్తుల విలువే ఎక్కువ కావడం గమనార్హం. అమెజాన్ అధినేతను కూడా ఓ దేశంగా పరిగణిస్తే.. 188 దేశాల జాబితాలో ఆయన 56వ ధనిక దేశంగా నిలుస్తారు.

బిల్ గేట్స్ సంపద..

బిల్ గేట్స్ సంపద..

గతంలో బిల్ గేట్స్ సంపద గరిష్టంగా 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుత ధరల ప్రకారం దాని విలువ 149 డాలర్లు ఉంటుంది. గత ఏడాది నుంచి ఆయన సంపద ప్రతి రోజూ రూ. 12 వేల కోట్ల మేర పెరుగుతోంది.

మన జీడీపీలో ఆరు శాతానికిపైగా

మన జీడీపీలో ఆరు శాతానికిపైగా

భారతదేశంతో బెజోస్ సంపదను పోలిస్తే.. ఆయన ఆస్తి మన జీడీపీలో ఆరు శాతానికిపైగా ఉంటుంది. భారత కుబేరుడు, ఆసియాలోకెల్లా సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఆస్తి కంటే బెజోస్ సంపద మూడున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అమెజాన్ సీఈవో దగ్గరున్న ఆస్తితో 3420 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు.

30 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడానికి 49 ఏళ్లు

30 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడానికి 49 ఏళ్లు

అమెజాన్ వ్యాపారాన్ని 30 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడానికి బెజోస్‌కు 49 ఏళ్లు పట్టింది. కానీ గత ఆరు నెలల్లోనే ఆయన సంపద విలువ 30 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon hits $1 trillion and becomes the second US company worth one trillion dollars after stock price surged Tuesday more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X