అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ సమ్మర్ సేల్, 80 శాతంకు పైగా తగ్గింపు
ఈ కామర్స్ రంగంలో రెండు దిగ్గజాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు నాలుగు రోజుల పాటు భారీ ఆఫర్లకు తెరతీసాయి.
ఈ కామర్స్ రంగంలో రెండు దిగ్గజాల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లు నాలుగు రోజుల పాటు భారీ ఆఫర్లకు తెరతీసాయి. ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకు తెరతీయగా అమెజాన్ గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ సేల్' కార్యక్రమంలో భాగంగా అమెజాన్ ఇండియా పలు ఉత్పత్తుల ధరలను పెద్ద మొత్తంలో తగ్గించి విక్రయిస్తోంది. మరి అమెజాన్ యాక్ససరీలపై అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

తగ్గింపు పొందిన గాడ్జెట్లు ఇవే
బోట్ బాస్ హెడ్స్ 230 వాస్తవ ధర రూ.1,299 అయితే ఆఫర్ లో భాగంగా రూ.449కే అందిస్తోంది. అలాగే, ఫోట్రాన్ వీఆర్ బాక్స్ 2.0 వాస్తవ ధర రూ.1,741 అయితే, కేవలం రూ.249కే అందిస్తోంది. శాన్ డిస్క్ యూఎస్ బీ 3.0 ఫ్లాష్ డ్రైవ్ ఎంఆర్పీ రూ.1,125 కాగా, రూ.928కి ఆఫర్ చేస్తోంది.

తగ్గింపు పొందినవి
ఫిలిప్స్ ఎస్పీఏ 75బి/94 స్పీకర్ విక్రయ ధర రూ.2,570 అయితే, సమ్మర్ సేల్ లో దీన్ని రూ.829కే ఆఫర్ చేస్తోంది. ఎంఐ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు 2ఐ ధర రూ.1,199 కాగా, రూ.899కు ఆఫర్ చేస్తోంది.

వైర్లెస్ మౌస్
డెల్ కంపెనీకి చెందిన డబ్ల్యూఎం126 మోడల్ వైర్లెస్ మౌస్ ను 13 శాతం తగ్గించి రూ.694కు అమ్ముతోంది. ఐబాల్ మ్యూజిక్ లైవ్ బీటీ39 మోడల్ పోర్టబుల్ స్పీకర్ల జతను 57 శాతం తగ్గించి రూ.999కు ఆఫర్ చేస్తోంది.

తగ్గింపు పొందినవి
ఇంటెక్స్ కంపెనీ పవర్ బ్యాంకు ఐటీ-పీబీ11కే ధర రూ.1,899 కాగా, కేవలం రూ.699కే ఆఫర్ చేస్తోంది. బోట్ స్టోన్ 200 స్పీకర్లు రూ.2,990 అయితే కేవలం రూ.999కే అందిస్తోంది.

తగ్గింపు పొందినవి
బ్రెయిన్ వాజ్ జైవ్ ఇయర్ ఫోన్ల ధరను 2,899గా ఉంటే రూ.999కు తగ్గించింది. ఇంకా మరెన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు అమెజాన్ సైటుకెళ్లి సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








