జబాంగ్ డాట్ కామ్ పై అమెజాన్ కన్ను!

Posted By:

జబాంగ్ డాట్ కామ్ పై అమెజాన్ కన్ను!

అమెరికన్ ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం అమెజాన్ (Amazon) భారత్‌లో తొలి కోనుగోలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దేశవాళీ ఫ్యాషన్ ఉత్పత్తుల ఆన్‌లైన్ రిటైలర్ జబాంగ్ డాట్ కామ్ (Jabong.com)ను కొనుగోలు చేసే క్రమంలో చర్చలు జరుపుతున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. ఈ డీల్ విలువ 1.2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని ఓ అంచనా. అమెజాన్, భారత్‌లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫ్యాషన్ ఉత్పత్తుల ఆన్‌లైన్ మార్కెట్లో వాటాను మరింత పెంచుకునే లక్ష్యంతో జబాంగ్ సంస్థను టేకోవర్ చేయలనుకుంటున్నట్లు సమాచారం.

త్వరలో ‘స్కైప్' వెబ్ వర్షన్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్కైప్ బ్రౌజర్ ఆధారిత వర్షన్‌ను శుక్రవారం ప్రకటించింది. త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ వెసలుబాటతో స్కైప్ యూజర్లు అన్ని వెబ్ బ్రౌజర్‌ల నుంచి స్కైప్ ఆడియో, వీడియో కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. త్వరలో ‘స్కైప్' వెబ్ వర్షన్ ప్రస్తుతం బేటా వర్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ ఆధారిత స్కైప్ యాప్ ద్వారా యూజర్లు తమ స్కైప్ అకౌంట్‌లలోకి ఫైర్‌ఫాక్స్, క్రోమ్, సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ల ద్వారా లాగిన్ కావచ్చని సాఫ్ట్‌వేర్ దిగ్గజం తెలిపింది.

స్కైప్ వెబ్ ఆధారిత వర్షన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే యూజర్లు నేరుగా వెబ్ బ్రౌజర్ నుంచే కాలింగ్ ఇంకా చాటింగ్ నిర్వహించుకోవచ్చు. నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్‌ను ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఉచితంగా మొబైల్, ల్యాండ్ ఫోన్‌లకు కాల్స్ చేసుకోవచ్చు అలానే వీడియో చాటింగ్ కూడా నిర్వహించుకోవచ్చు. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Amazon in talks to buy Jabong for $1.2 bn. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot